గత శుక్రవారం లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురై కుప్పం ఆసుపత్రిలో చేరిన నందమూరి తారకరత్న క్రిటికల్ కండిషన్ లో బెంగుళూరు నారాయణ హృదయాలయకి తరలించబడ్డారు. బెంగుళూరులో తారకరత్నకు పదిమంది వైద్య బృందం చికిత్స అందించింది. కానీ తారకరత్న ఐదారు రోజులు క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లుగా వైద్యులు ప్రకటించారు. నిన్నటి వరకు తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. కానీ ఈ రోజు ఓ అద్భుతం జరిగింది. తారకరత్న గుండె చికిత్సకి స్పందిస్తుందని, అంతేకాకుండా మిగతా అవయవాలు కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ గత వారం రోజులుగా ఆయన పనులన్నీ పక్కనపెట్టి అన్న కొడుకు తారకరత్న ఆరోగ్యం విషయంలో కలత చెందారు. అటు తారకరత్న భార్యని, ఇటు నందమూరి ఫ్యామిలీని, అభిమానులను ఓదార్చుతూ ఆయన తారకరత్న కోసం నిలబడ్డారు. నందమూరు కుటుంబ సభ్యుల ప్రార్ధనలు, అభిమానుల పూజలు, బాబాయ్ బాలయ్య కృషి ఫలించడంతో తారకరత్న నెమ్మదిగా రికవరీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా మృత్యువడిలోకి చేరి మళ్ళీ యముడితో పోరాడి ఆయన తన కుటుంబం కోసం, లక్షలాదిమంది అభిమానుల కోసం వెనక్కి వచ్చారు.
బాలయ్య ఆ యముడితో పోరాడి అన్న కొడుకుని వెనక్కి తీసుకువచ్చారు అంటూ నందమూరి అభిమానులు ప్రౌడ్ గా ఫీలవుతున్నారు. తారకరత్న కోలుకోవడానికి కొన్నివారాలు పడుతుంది, ప్రస్తుతం ప్రాణాపాయం నుండి ఆయన బయటపడ్డారని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.