Advertisement
Google Ads BL

జాన్వీ ఏ తమిళ సినిమాకి సైన్ చెయ్యలేదు


బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అక్కడ హిందీ సినిమాల్లో తనని తాను నిరూపించుకునేందుకు యుద్ధం చేస్తుంది. సినిమాల్లో పద్దతి గల కేరెక్టర్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబొయ్యడమే తన పనిలా పెట్టుకుంది. హెవీ గ్లామర్ షో తో ఎక్స్ పోజ్ అయ్యే జాన్వీ కపూర్.. తన గ్లామర్ ట్రీట్ వెనుక ఉన్న రహస్యాన్ని కూడా విప్పింది. అంత గ్లామర్ గా కనిపిస్తూ ఫోటో షూట్స్ చేస్తేనే తనకి యాడ్స్ లో నటించే అవకాశం వస్తుంది.. అప్పుడు తీసుకున్న EMI లు పే చెయ్యొచ్చు అంటూ సీక్రెట్ రివీల్ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్ లో మంచి పోజిషన్ కి వచ్చాక సౌత్ ఎంట్రీ ఇస్తే విపరీతమైన గిరాకీ ఉంటుందని భావించిన జాన్వీకి బాలీవుడ్ ఎప్పటికప్పుడు షాకులిస్తూనే ఉండడంతో ఆమె ఫోకస్ సౌత్ పై పడింది. చాలారోజుల నుండి టాలీవుడ్ దర్శకులు జాన్వీ కపూర్ ని తెలుగులోకి పరిచయం చేస్తున్నారనే న్యూస్ రావడం జాన్వీ కపూర్ తో పాటుగా బోని కపూర్ కొట్టిపారెయ్యడం చూస్తున్నాం. కానీ ఈమధ్యన జాన్వీ కపూర్ పదే పదే సౌత్ సినిమాల్లో నటించే విషయమై మాట్లాడుతుంది.

ఇప్పుడు ఫైనల్లీ జాన్వీ కపూర్ సౌత్ సినిమాకి సైన్ చేసింది.. అంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా బోని కపూర్ నిర్మాతగా జాన్వీ కపూర్ తమిళ సినిమాకి సైన్ చేసింది.. అయితే జాన్వీ కపూర్ ఏ హీరోతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుందో.. ఆ సినిమా వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపించడంతో బోని కపూర్ జాన్వీ ఏ సౌత్ సినిమాకి, అందులోని ఏ తమిళ సినిమాకి సైన్ చెయ్యలేదు అంటూ అఫీషియల్ గా ప్రకటన ఇవ్వడంతో తమిళ పీఆర్వో రమేష్ బాల జాన్వీ కపూర్ ఏ తమిళ సినిమా ఒప్పుకోలేదు అంటూ కన్ ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసారు.

Janhvi to make her South debut :

Janhvi Kapoor to make her South debut with a Tamil film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs