Advertisement
Google Ads BL

ప్రభాస్-హ్రితిక్ కాంబో: భారీ పారితోషకాలు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ కలిసి బాలీవుడ్ దర్శకుడు, పఠాన్ తో కోట్లు కొల్లగొడుతున్న సిద్దార్థ్ ఆనంద్ ఓ బడా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారనే న్యూస్ చూసాక ఇండియా వైడ్ ప్రేక్షకులు తెగ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. సిద్దార్థ్-ప్రభాస్ కాంబో చిత్రం ఇప్పటికే మైత్రి బ్యానర్ లో ఓకె కాగా.. ఈ చిత్రం కోసం హ్రితిక్ రోషన్ ని నెగెటివ్ కేరెక్టర్ కోసం సంప్రదిస్తున్నారనే న్యూస్ కి సోషల్ మీడియానే షేకైపోయింది. ప్రభాస్-హ్రితిక్ రోషన్ అంటే అంచనాలు భీభత్సంగా ఉంటాయి.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని 750 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాదు, ప్రభాస్ ఈ చిత్రానికి 100 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడట. అంతేకాకుండా హ్రితిక్ రోషన్ కి 75 కోట్ల పారితోషకం సెట్ చేశారట. ప్రభాస్ హీరోగానూ, హ్రితిక్ రోషన్ ని విలన్ గా చూపించబోయే ఈ చిత్రం కోసం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ని సెలక్ట్ చెయ్యాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మైత్రి వారు సిద్దార్థ్ ఆనంద్ పఠాన్ సక్సెస్ కి విష్ చేసి వచ్చారు. 

ప్రస్తుతం సిద్దార్థ్ షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించిన పఠాన్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా వచ్చి భారీ విజయం సాధించడంతో పాటు వందల కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. కొద్దిరోజులుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు పఠాన్ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. దానితో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్-హ్రితిక్ రోషన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఆ హైప్ మాములుగా ఉండదు. ఈ చిత్రం 2024లో పట్టాలెక్కనుందని సమాచారం.

Prabhas-Hrithik Combo: Huge Remuneration:

India Biggest Multi Starrer: Prabhas, Hrithik Combination Fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs