Advertisement
Google Ads BL

ప్రమాదం నుండి కోలుకున్న విజయ్


బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని.. బిచ్చగాడు 2 షూటింగ్ మలేషియాలో జరుగుతున్న సమయంలో షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురయ్యారు. విజయ్ ఆంటోని ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దవడ ఎముకలు, ముక్కు బాగా దెబ్బతినడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రమాదానికి గురైన తర్వాత ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆయన కోమాలోకి వెళ్లాడని ప్రచారము జరిగింది. కొద్దిరోజుల తర్వాత విజయ్ ఆంటోని తనకి జరిగిన ప్రమాదం నుండి కొద్దిగా కోలుకున్నట్లుగా.. మేజర్ ఆపరేషన్ పూర్తయ్యినట్లుగా థంబ్ చూపిస్తూ హెల్త్ అప్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం తాను 90 శాతం కోలుకున్నట్లుగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. తాను 90 శాతం కోలుకున్నాను అని, ప్రేమించే హృదయాలకు కృతజ్ఞతలు. నా విరిగిన దవడ, ముక్కు ఎముకలు ఇప్పుడు కలిసిపోయాయి. మీ అభిమానం వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాను. ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న బిచ్చగాడు 2 పనులను ఈరోజు నుంచి ప్రారంభిస్తాను అంటూ ట్వీట్ చెయ్యడంతో విజయ్ ఆంటోని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Vijay recovers from the accident:

Vijay Antony Has Recovers From Surgery Post Accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs