Advertisement
Google Ads BL

SSMB28 సెట్స్ లో క్రికెట్ మ్యాచ్


సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో క్రేజీ ప్రాజెక్ట్ గా హ్యాట్రిక్ మూవీగా మొదలైన SSMB28 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. సెప్టెంబర్ లోనే మొదలైన SSMB28 మొదటి షెడ్యూల్ అంత సంతృప్తిగా లేకపోవడంతో ఆ యాక్షన్ సన్నివేశాల ఎపిసోడ్ ని పక్కనబెట్టేసి త్రివిక్రమ్ సెకండ్ షెడ్యూల్ లో అదే యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు అని తెలుస్తోంది. మహేష్ రెగ్యులర్ గా సైలెంట్ గా షూట్ కి జాయిన్ అవుతున్నా SSMB28 నుండి ఏదో ఒక లీక్ బయటికి వస్తూనే ఉంది. 

Advertisement
CJ Advs

తాజాగా త్రివిక్రమ్ SSMB28 సెట్స్ లో క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. SSMB28 టెక్నీకల్ డిపార్ట్మెంట్, అలాగే నటులతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సరదాగా సెట్స్ లో క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో త్రివిక్రమ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. ఇక ఈ చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ పూజ హెగ్డే, శ్రీలీల లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

అయితే మహేష్ తో తలపడబోయే విలన్ పై అందరిలో సస్పెన్స్ నడుస్తుంది. త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి విలన్ ని మహేష్ కోసం సెట్ చేసారు, సెకండ్ హీరోగా ఎవరిని దింపుతున్నారో, ఏ సీనియర్ హీరోయిన్ ని SSMB28 లో భాగం చేయబోతున్నారో అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.

Cricket match in SSMB28 sets:

Trivikram turns shoot venue into Cricket ground
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs