Advertisement
Google Ads BL

కృతి శెట్టి వర్కౌట్ లుక్


హ్యాట్రిక్ హిట్స్, హ్యాట్రిక్ ప్లాప్స్ తో మూడేళ్ళలో ఆరు సినిమాలు చేసి క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా వుంది. బేబమ్మ చిన్న వయసులోనే వెండితెర మీదకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే స్టార్ డమ్ సంపాదించుకుంది. వరసబెట్టి యంగ్ హీరోలంతా కృతి శెట్టి చుట్టూతానే ప్రదక్షణలు చేసారు. గత ఏడాది బంగార్రాజుతో మంచి హిట్ వచ్చినా, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం లాంటి డిసాస్టర్ కృతి శెట్టిని బాగా ఇబ్బంది పెట్టాయి. ట్రెడిషనల్ గాను, గ్లామర్ గాను ఆకట్టుకున్న కృతి శెట్టి ఫొటోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడొక పిక్ విపరీతంగా వైరల్ అయ్యింది. కృతి శెట్టి యోగాసనం వేసి వర్కౌట్స్ చేస్తున్న పిక్ అది. కృతి శెట్టి యోగ భంగిమ ఆకట్టుకుంది. సన్నగా నాజూగ్గా ఉండే కృతి శెట్టి గ్లామర్ డాల్ గా కనబడుతుంది. అయితే కృతి శేట్టిలో ఉన్న చిన్న లోపం ఆమె నవ్వు. అందంగానే నవ్వుతుంది.. అందులో పేరు పెట్టడానికి లేదు. కానీ ఆమె నోరు మరీ పెద్దగా కప్ప నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కృతి శెట్టి నవ్వితే ఆమె నోరు చాలా వెడల్పుగా కనబడుతుంది. మిగతంతా సూపర్ అంటారామె ఆమె ఫాన్స్. మరి ఆ లోపం ప్లాస్టిక్ సర్జరీతో ఎమన్నా సరి చేయిస్తే అదిరిపోతోంది అనేది అభిమానుల ఫీలింగ్.

ఈ విషయమై కృతి శెట్టి ఏమాలోచిస్తుందో.. కానీ ప్రస్తుతం కృతి శెట్టి న్యూ వర్కౌట్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో భీభత్సంగా సర్క్యులేట్ అయ్యింది.

Krithi Shetty new workout look :

Krithi Shetty workout look vieal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs