Advertisement
Google Ads BL

అలా దొరికిపోయిన విజయ్-రష్మిక


విజయ్ దేవరకొండ కి రష్మిక కి మధ్యన ఏదో ఉంది అంటూ మీడియాలో కథనాలు రావడం, దానికి విజయ్ దేవరకొండ, రష్మిక ఏమి లేదు మా మధ్యన అంటూ రియాక్ట్ అవడం చాలాసార్లు చూసాం. మేము ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లకూడదా అంటూ గోవా, మాల్దీవులకు కలిసి వెకేషన్స్ కి వెళ్లిన విషయాన్ని చెప్పకనే చెప్పేసింది రష్మిక. విజయ్ దేవరకొండ ఫ్యామిలితోను రాసుకు పూసుకు తిరిగే రష్మిక.. అతనితో ముంబైలో లేట్ నైట్ డిన్నర్ కి వెళ్ళింది. అందుకే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరిగేది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా రష్మిక-విజయ్ మీడియా కంటపడకుండా దుబాయ్ చెక్కేశారనిపిస్తుంది. విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్ళినట్టుగా.. దుబాయ్ వెకేషన్స్ కి మంచి ప్లేస్ అంటూ ట్వీట్ చెయ్యడం చూసాం. విచిత్రంగా రష్మిక మందన్న కూడా విజయ్ తో పాటు దుబాయిలో కనబడి అందరికి షాకిచ్చింది. విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వీధుల్లో, ఎడారిలో కూడా ఫొటోలకు పోజులిచ్చాడు. అయితే విజయ్ ఫ్యామిలీ ఫొటోస్ దుబాయ్ ఎడారిలో కనబడితే.. రశ్మికతో విజయ్ పిక్ ఒకటి హోటల్ దగ్గర ఉన్నట్లుగా ఉంది. ఇప్పుడా ఫొటోనే విజయ్, రష్మిక లవ్ బర్డ్సే అని కన్ఫమ్ చేసేదిలా ఉంది. హోటల్ బాల్కనీలో రష్మిక-విజయ్ నిలబడినప్పుడు దూరం నుంచి తీసిన ఫొటోగా కనిపిస్తోంది. 

అయితే రష్మిక నిజంగానే విజయ్ తో దుబాయ్ కి వెళ్లిందా అనడానికి ఈ పిక్ తప్ప ఆధారాలు లేవు. సో ఈ పిక్ నిజమా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఎంత ఫ్రెండ్ అయితే తరచూ వెకేషన్స్ కి వెళ్ళిపోతారా, అయినా సీక్రెట్ గా వెళ్లడం ఎందుకు ఫ్రెండ్స్ అయితే అందరికి తెలిసేలా వెళ్లొచ్చు కదా రష్మికా అంటూ నెటిజెన్స్ రశ్మికని ప్రశ్నిస్తున్నారు. 

Vijay Devarakonda-Rashmika enjoys Dubai?:

Vijay Deverakonda enjoys Dubai vacation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs