Advertisement
Google Ads BL

జబర్దస్త్ కి నాగబాబు రీ ఎంట్రీ


జబర్దస్త్ మొదలైనప్పుడు జెడ్జ్ లుగా నాగబాబు-రోజా మల్లెమాలకి సపోర్ట్ గా నిలిచారు. అటు కామెడీ షోలో నవ్వడమే కాదు, పారితోషకం అందుకోవడమే కాదు, కమెడియన్స్ ని ఒక్కటిగా ఉంచుతూ.. వారిని లీడ్ చేసిన నాగబాబు, రోజాలకి జబర్దస్త్ తో మంచి పేరు వచ్చింది. రోజా కన్నా ఎక్కువగా నాగబాబు కమెడియన్స్ తో కలిసిపోయి స్నేహం చేసారు. కొన్నేళ్ళకి నాగబాబు ఎంత చెబితే అంత అనే టైప్ కి చాలామంది కమెడియన్స్ వచ్చేసారు. నాగబాబు కష్టాల్లో ఉన్నప్పుడు మల్లెమాల యాజమాన్యం ఆయనకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి ఆదుకుంది అని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కొన్ని విషయాలల్లో జబర్దస్త్ యాజమాన్యంతో విభేదించి బయటకి వచ్చేసిన నాగబాబు ఆయనతో పాటుగా చాలామంది కమెడియన్స్ ని జబర్దస్త్ నుండి బయటికి తీసుకొచ్చేసారు అన్నారు. చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి వాళ్ళు నాగబాబుని నమ్ముకునే బయటికి వచ్చారు. కానీ నాగబాబు నేను ఎవరిని రమ్మనలేదు, ఎవరి రిస్క్ వారిదే అన్నారు.

Advertisement
CJ Advs

అయితే నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లో తెచ్చుకున్న పేరు, పరపతి వేరే ఛానల్స్ ద్వారా తెచ్చుకోలేకపోయారు. ప్రస్తుతం సినిమాలు, జనసేన పార్టీ పనులు చూసుకుంటున్న ఆయనని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. మీ కోసం చాలామంది జబర్దస్త్ ని వదిలేసారు. ఇప్పుడు సుధీర్ కూడా మీ మీద గౌరవంతోనే జబర్దస్త్ వదిలేసాడా అని అడిగితే.. అదేం లేదు, సుధీర్ కి బయట కొన్ని ఆఫర్స్ వచ్చాయి అని విన్నాను, అందుకే వచ్చేసాడు అన్నారు.

ఇక మీరు మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తారా? పిలిస్తే వెళతారా? అని అడిగితే మల్లెమాలతో నాకేమి గొడవలు, విభేదాలు లేవు.. పిలిస్తే తప్పకుండా వెళతాను, కానీ అడిగి వెళ్ళను, నేను వస్తాను అని అడుక్కోను, మళ్ళీ పిలిస్తే మాత్రం డెఫనెట్ గా వెళతాను అంటూ నాగబాబు జబర్దస్త్ కి రీ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.

Nagababu re-entry to Jabardasth:

Nagababu On Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs