Advertisement
Google Ads BL

విజయ్ ఫాన్స్ కి సమంత క్షమాపణలు


సమంత ఇప్పుడిప్పుడే రొటీన్ లైఫ్ లోకి వస్తుంది. గత ఆరు నెలలుగా తీవ్రమైన అనారోగ్యంతో ఇంటి పట్టునే రెస్ట్ తీసుకుంటున్న సమంత ఇప్పుడు శాకుంతలం రిలీజ్ ప్రమోషన్స్ కోసం నెమ్మదిగా పబ్లిక్ లోకి వస్తుంది. అయితే సమంత నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ శాకుంతలం ఫిబ్రవరి 17 నుండి పోస్ట్ పోన్ అయ్యింది అనే టాక్ నడుస్తుంది. రీసెంట్ గానే జిమ్ వీడియోస్ తో సమంత యాక్టీవ్ అవ్వగా.. ఈరోజు నుండి శాకుంతలం ప్రమోషన్స్ లో ఆమె పాల్గొనబోతుంది అన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయితే ప్రమోషన్స్ కూడా పోస్ట్ పోన్ అవుతాయి. అయితే సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులకి క్షమాపణలు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

కారణం సమంత వలన విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా సమంతపై ఒత్తిడి తేలేక నీళ్లు నములుతున్నాడు. దానితో ఖుషి సినిమా అయిపోయింది. అందుకే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాకి జంప్ అయ్యాడు, శివ నిర్వాణ కూడా మార్చి కల్లా సమంత రాకపోతే వేరే ప్రాజెక్ట్ పైకి వెళ్ళిపోతాడంటూ ఏవేవో కథలు ప్రచారంలోకి రాగా.. దానికి శివ నిర్వాణ వెంటనే రిప్లై ఇస్తూ ఎవ్వరూ కంగారు పడకండి, ఖుషి రెగ్యులర్ షూట్ సూన్ అంటూ ట్వీట్ చేసాడు. దానికి కూడా శివ నిర్వాణ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. అందుకే షూట్ పై పక్కా క్లారిటీ ఇవ్వలేదు అంటూ విమర్శించారు.

దానితో సమంత లైన్ లోకి వచ్చేసింది. #Kushi will resume very soon.. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial👍 అంటూ ఖుషి షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది, విజయ్ దేవరకొండ ఫాన్స్ కి క్షమాపణలు అంటూ ట్వీట్ చేసింది. తనవల్ల షూటింగ్ లేట్ అయ్యింది అంటూ విజయ్ అభిమానులకి ఆమె సారి చెప్పి వాళ్ళ మనసులని గెలుచుకుంది.

Samantha apologizes to Vijay Deverakonda fans:

Samantha Ruth Prabhu apologises to Vijay Deverakonda fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs