Advertisement
Google Ads BL

పాన్ ఇండియా మూవీ అయినా రక్షిస్తుందా?


సందీప్ కిషన్ కొంతకాలంగా సక్సెస్ కోసం బాగా ఎదురు చూస్తున్నాడు. కానీ సందీప్ కి సక్సెస్ మాత్రం ఆమడదూరానే నిలిచిపోతుంది. వరస సినిమాలు చేస్తున్నాడు.. హిట్ మాత్రం పడడం లేదు. A1 ఎక్స్ప్రెస్ డిసాస్టర్ తర్వాత సందీప్ కిషన్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. మైకేల్ ని గ్యాంగ్ స్టర్ డ్రామాతో పాన్ ఇండియాలోని ఐదు భాషల్లో సినిమాని తెరకెక్కించాడు. రేపు శుక్రవారం ఫిబ్రవరి 3 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Advertisement
CJ Advs

రంజిత్ జయకుడి డైరెక్షన్ లో మైకేల్ గా సందీప్ కిషన్ మాస్ అవతార్ లో కేక పెట్టిస్తున్నాడు. మైకేల్ ట్రైలర్ చూస్తే సందీప్ కి ఈసారి హిట్ పక్కా అనిపించేలా ఉంది. పాన్ ఇండియా ప్రమోషన్స్ తో హీట్ పుట్టిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న సందీప్ కిషన్ లో మైకేల్ తో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకోవాలనే కసి కనబడుతుంది. పాన్ ఇండియా భాషల్లో భారీగా ప్రమోట్ చేస్తున్న ఈ ఫిల్మ్ తో సుందీప్ కిషన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

దివ్యంగా కౌశిక్ గ్లామర్ ట్రీట్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ లాంటి క్రేజీ స్టార్స్ మైకేల్ కి తోడవడం సందీప్ కి ఇంకాస్త ప్లస్ గా మారింది. సందీప్ కిషన్ ని ఈ మూవీ అయినా రక్షిస్తుందేమో చూడాలి.

Michel releasing on Feb 3rd :

Sundeep Kishan pan india film Michel releasing on Feb 3rd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs