ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో ఫైట్ కి దిగిన బాలకృష్ణ వీరసింహరెడ్డి ఎలాగో గట్టెక్కింది. క్రేజీగా, భారీ అంచనాల నడుమ విడుదలైన వీరసింహారెడ్డి ఫాన్స్ ని అలరించినా సాధారణ ప్రేక్షకుడి నోట సో సో అనిపించుకుంది. అదే గనక వాల్తేర్ వీరయ్య రాకపోయుంటే వీరసింహారెడ్డి కలెక్షన్స్ పరంగా మంచి అంకెలు నమోదు చేసేది. కానీ వాల్తేర్ వీరయ్య రాకతో వీరసింహారెడ్డి కలెక్షన్స్ పరంగా బాగా డల్ అయ్యింది. అయితే జనవరి 12 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న వీరసింహారెడ్డి ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యింది.
వీర సింహారెడ్డిని థియేటర్లో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వీరసింహారెడ్డి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. వీర సింహారెడ్డిని ఫిబ్రవరి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అంటే రిలీజ్ అయిన 40 రోజుల తర్వాత వీరసింహారెడ్డి ఓటిటిలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అప్పట్లో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టారే దక్కించుకుంది. అఖండ ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
దానితో మరోసారి బాలయ్య చిత్రం వీరసింహారెడ్డిని భారీ ధరకు కొనుగోలు చేసింది హాట్ స్టార్. మరి ఈచిత్రం ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.