Advertisement
Google Ads BL

పఠాన్ కి భయపడి వెనక్కి తగ్గారు


బాలీవుడ్ లో షారుఖ్ నటించిన పఠాన్ మూవీ రిపబ్లిక్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పఠాన్ మూవీ మొదటి రోజు నుండి భీభత్సమైన వసూళ్ల తో బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. 100 కోట్ల ఓపెనింగ్స్ తో పఠాన్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చెప్పేలా చేసింది. మొదటి రోజే కాదు.. ఫస్ట్ వీకెండ్ వరకు షారుఖ్ పఠాన్ వసూళ్ల జాతర సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. మొదటి ఐదు రోజుల్లో 550 కోట్ల గ్రాస్ తో పఠాన్ పరవళ్లు తొక్కింది. ఐదేళ్ల అభిమానుల నీరీక్షణని షారుఖ్ పఠాన్ తో పటాపంచలు చేసారు.

Advertisement
CJ Advs

అయితే పఠాన్ ప్రభంజనం ముందు ఎక్కడ ఓడిపోతామో, లేదంటే పఠాన్ కలెక్షన్స్ ముందు ఎక్కడ ఇరుకునపడతామో అంటూ కార్తీక్ ఆర్యన్ తాను నటించిన షెహ్ జాదా ని వాయిదా వేసుకున్నాడు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో కార్తీక్ ఆర్యన్ షెహ్ జాదా గా రీమేక్ చేసాడు. షెహ్ జాదా ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేయ్యగా.. ఇప్పుడు పఠాన్ తర్వాత ఫిబ్రవరి 10న షెహ్ జాదా రిలీజ్ అవ్వాల్సి ఉంది.

కానీ కార్తీక్ ఆర్యన్ షెహ్ జాదా ని ఓ వారం పాటు అంటే ఫిబ్రవరి 17 కి వాయిదా వేసుకున్నాడు. అయితే షెహ్ జాదా వాయిదాకి కారణం పఠాన్ బాక్సాఫీసుని షేక్ చెయ్యడమే అని తెలుస్తుంది. షెహ్ జాదా పోస్ట్ పోన్ విషయం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ సినిమా వాయిదా అనేది కన్ ఫర్మ్ అంటున్నారు.

Shehzada Pushed Out Of Respect For Pathaan:

Karthik Aryan Shehzada postponed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs