Advertisement
Google Ads BL

తారకరత్న హెల్త్ పై చిరు ట్వీట్


నందమూరి తారకరత్న హార్ట్ ఎటాక్ తో బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనగానే ఉన్నారు. ఎందుకంటే తారకరత్న ఆరోగ్యంపై నిన్న సోమవారం నారాయణ హృదయాల వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యగా.. అందులో తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది, ఆయనకి మెరుగైన చికిత్స అందిస్తున్నాము, ఇంకా వెంటిలేటర్ పైనే తారకరత్నకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తారకరత్న ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులకి ఎప్పటికప్పుడు తెలిజేస్తున్నామంటూ ప్రకటించడంతో తారకరత్న ఇంకా కోలుకోలేదు, అవుట్ అఫ్ డేంజర్ అనే మాట వింటామనుకుంటే ఇదేమిటీ అంటూ అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎవరూ తారకరత్నని చూసేందుకు ఆసుపత్రికి రావొద్దు మమ్మల్ని సవ్యంగా ట్రీట్మెంట్ చెయ్యనివ్వండి అంటూ నారాయణ హృదయాల వైద్యులు రిక్వెస్ట్ చేసారు.

Advertisement
CJ Advs

పదిమంది డాక్టర్స్ బృందం తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్న ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియకపోవడంతో అయోమయంలో ఉన్నారు అభిమానులు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న హెల్త్ కండిషన్ పై ఓ ట్వీట్ చేసారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.  తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. 

May you have a long and healthy life dear Tarakaratna! అంటూ మెగాస్టార్ చిరంజీవి తారకరత్న హెల్త్ పై అప్ డేట్ ఇస్తూ కోలుకుంటున్నారని ట్వీట్ చెయ్యడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Megastar Says Taraka Ratna Is Out Of Danger:

Chiranjeevi About Taraka Ratna Health
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs