కొంతమంది హీరోయిన్స్ తాము క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము, మాకు ఆఫర్స్ ఇవ్వడానికి హీరో కమిట్మెంట్ అడిగాడు, ఈ దర్శకుడు కమిట్మెంట్ అడిగాడు అంటూ వాళ్ళ పేర్లు చెప్పకుండా క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కెరీర్ లో మంచి పొజిషన్ కి వచ్చాక తమని కమిట్మెంట్స్ అడిగారు అంటూ గొంతెత్తుతారు. తమని కమిట్మెంట్ అడిగినవాళ్ల పేర్లు బయటపెట్టలేని వారు ఇలాంటి ఆరోపణలు చెయ్యడం ఎంతవరకు కరెక్టో అర్ధం కాదు.
తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లుగా ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ నయనతార కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళంలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతారకి కెరీర్ ఆరంభంలోనే కమిట్మెంట్స్ అడిగారట. కానీ నయనతార అస్సలు ఒప్పుకోకుండా.. తనకొచ్చిన అవకాశాలతో ఇంతవరకు ఎదిగినట్టుగా చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. లేదా అనే దానిని గురించి మాట్లాడాను, కొన్నిసార్లు మన ప్రవర్తనని బట్టి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.
నన్ను కమిమెంట్స్ అడిగారు. కానీ నాకిష్టం లేదని కుండ బద్దలు కొట్టాను. నా టాలెంట్ తో నేను ఇంత పైకి ఎదిగాను అంటూ చెప్పడం చూసి.. అప్పట్లో జరిగిన మేటర్ ని ఇప్పుడు ఈ పొజిషన్ లో నయన్ ఎందుకు బయటపెట్టిందో అంటూ నెటిజెన్స్ గుసగుసలాడుకుంటున్నారు.