Advertisement
Google Ads BL

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న స్టార్ హీరో


కోలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ కి బీభత్సమైన క్రేజ్ ఉంది, అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అజిత్ కేవలం హీరోనే కాదు ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్ కూడా. అలాగే బైక్ రేసర్. అయితే ఒకప్పుడు అజిత్ సినిమాలంటే ఎగబడి చూసే ప్రేక్షకులు ఇప్పుడు అజిత్ సినిమా వస్తుంది అంటే ఆ ఏముందిలే పాటలు, ఫైట్స్ తప్ప సినిమాలో ఇంకేం ఉండదనే కామెంట్స్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా అజిత్ మూస కథలతో సినిమాలు చేస్తూ పోతున్నాడు. కథ విన్నాక అది ఆడియన్స్ కి రీచ్ అవుతుందా.. లేదా అనేది అజిత్ పట్టించుకోవడం లేదనేది అభిమానుల వాదన.

Advertisement
CJ Advs

సినిమా ఒప్పుకున్నానా.. షూటింగ్ చేసానా, అయ్యిపోయిందా అనుకుంటున్నాడు తప్ప కథ ఎలా ఉంది, సినిమా ఎలా వచ్చింది, ఇది ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది. అసలు ఈ కథ వర్కౌట్ అవుతుందా, లేదా అనేది అజిత్ పట్టించుకోవడం లేదంటూ తునివి రిజల్ట్ తర్వాత ప్రేక్షకులు నుండి వస్తున్న కంప్లైంట్. తునివి కూడా ఏదో అజిత్ మీదున్న క్రేజ్ తో ఆడింది కానీ.. లేదంటే ఆ సినిమా అట్టర్ ప్లాప్ ల్లో ఒకటిగా నిలిచిపోయేది. కేవలం యాక్షన్, హీరోయిజం హైలెట్ అయితే జనాలు చూడరు. కంటెంట్ ఉండాలి, అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు.

అయితే ఇప్పుడు అజిత్ ప్రేక్షకుల కంప్లైంట్ ని, అభిమానుల ఆరాటంపై ఫోకస్ పెట్టబోతున్నాడట. అందులో భాగంగానే తునివి తర్వాత ఆయన చెయ్యాల్సిన విగ్నేష్ శివన్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడని, విగ్నేష్ ని కథ మార్చమని అడిగినట్లుగా వార్తలు రావడమే కాదు, అజిత్ ని ఇంప్రెస్స్ చెయ్యలేక విగ్నేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే న్యూస్ కూడా వినిపిస్తుంది. అఫీషియల్ గా ప్రకటన ఇచ్చిన AK62 నుండి విగ్నేష్ బయటికొచ్చేసాడని అంటున్నారు. మరి అన్నీ అయ్యాక ఇప్పుడు అజిత్ కళ్ళు తెరిచాడేమో.. అందుకే మూసకథలకు స్వస్తి చెప్పి కొత్తగా సినిమా చెయ్యాలని చూస్తున్నాడేమో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Change Of Plans In Ajith Next:

Vignesh Shivan Is Not Directing Ajith Next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs