బెంగుళూరు నారాయణ హృదయాలయలో నందమూరి తారకరత్న ప్రాణాలతో పోరాడుతున్నాడు. నిన్న ఆదివారం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తారకరత్న పోరాడుతున్నాడు, ఆయన తిరిగికోలుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే తారకరత్న హార్ట్ స్ట్రోక్ కి గురై కుప్పం ఆసుపత్రికి చేరినప్పటినుండి.. బెంగుళూరు నారాయణ హృదయాలయకి తరలించి అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ప్రత్యేక వైద్య బృందంతో తారకరత్నకు ట్రీట్మెంట్ జరిగేలా చూడడం, తారకరత్నని పరామర్శించేందుకు వస్తున్న కుటుంబ సభ్యులని, అలాగే తారక రత్న కుటుంబ సబ్యులని ఓదారుస్తున్న నందమూరి బాలకృష్ణని చూసిన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య ని పదే పదే విమర్శిస్తారు కానీ.. అన్న కొడుకు కోసం రాత్రి బవళ్ళు నిద్రాహారాలు మానేసి ఆయన నిలువుకాళ్ల మీద ఆసుపత్రిలోనే ఉంటున్నారు. NBK108 షూటింగ్ పక్కనబెట్టేశారు, అల్లుడి పాదయాత్రని పట్టించుకోవడం లేదు. తన బిజీ షెడ్యూల్స్ ని పక్కనపడేసి అన్న కొడుకు ప్రాణం కోసం బాలయ్య అహర్నిశలు శ్రమిస్తున్నారు. నందమూరి అభిమానులు బాలయ్య-తారకరత్న ఉన్న వీడియోస్ ని ఫొటోస్ ని షేర్ చేస్తూ బాబాయ్ కోసం బ్రతికి రా అన్నా అంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. నిజంగానే తారకరత్న పల్స్ పడిపోయి హార్ట్ కూడా ఆగిపోయి తిరిగి మళ్ళీ కొట్టుకోవడం మిరాకిల్ అన్నారు బుచ్చయ్య చౌదరి.
కానీ ఆయనకి ఈరోజు చెయ్యబోయే టెస్ట్ ల్లో అవుట్ అఫ్ డేంజర్ అని రావాలని అభిమానులు కోరుకోవడమే కాదు, బాలయ్య అన్న కొడుకుని బ్రతికించడానికి పడుతున్న ఆరాటం చూసినవారు అసలు పోరాడుతున్నది బాలయ్యా లేదంటే తారకరత్ననా అంటున్నారు.
తారకరత్నని బ్రతికించడం కోసం బాలయ్య పడుతున్న ఆవేదన, ఆరాటం అన్ని వీడియోస్, ఫొటోస్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. మరి కోట్లాదిమంది ప్రజల కోరిక, బాలయ్య ఆరాటం, అభిమానుల ఆవేదనని తీరుస్తూ తారకరత్న క్షేమంగా బయటపడాలని మనమూ కోరుకుందాము.