కొద్దిరోజులుగా సమంత మాయోసైటిస్ తో బాధపడుతూ అటు జిమ్ కి ఇటు షూటింగ్స్ కి దూరంగా ఉంటుంది. రీసెంట్ గానే సమంత మాయోసైటిస్ నుండి కోలుకుంటూ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసింది. ఇప్పటికే జిమ్ లో శరీరాన్ని కష్టపెడుతూ ఆ వీడియోస్ ని తాను తీసుకుంటున్న డైట్ విషయాలను షేర్ చేస్తుంది. ప్రస్తుతం శాకుంతలం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన శాకుంతలం వచ్చే నెల ఫిబ్రవరిలో శివరాత్రికి విడుదల కాబోతుంది.
శాకుంతలం మూవీలో సమంత అమాయకురాలిగా, మోసపోయే అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ చిత్రంలో సమంతని శకుంతలగా ఒరిజినల్ నగలతో నింపేశారు. తాజాగా శాకుంతలం నుండి వదిలిన సమంత లుక్ లో సమంత దేవకన్యలా మారిపోయింది. పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో వసుంధర డైమండ్ అండ్ జువెలర్స్ వారు డిజైన్ చేసిన హారం, నెక్లెస్, చేతులకి వంకీలు, గాజులు, చెవులకి బుట్టలు, పాపిడి బిళ్ళ నగలతో సమంత మెరిసిపోయింది. అందానికి గ్లామర్ అద్దినట్టుగా. అచ్చం ఏంజెల్ లా సమంత లుక్స్ అదిరిపోయాయి.
జస్ట్ పిక్స్ లోనే ఇంత మెస్మరైజ్ చేస్తున్న సమంత.. శాకుంతలంలో శకుంతలగా ఇంకెంత మురిపిస్తుందో చూడాలి.