నందమూరి హీరో తారకరత్న క్రిటికల్ కండిషన్ లో కుప్పం ఆసుపత్రి నుండి బెంగుళూరు నారాయణ హృదయాలయకి తరలించారు. తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆయనకి బాగా సీరియస్ అయ్యింది. అందులోను బిపి ఎక్కువగా ఉండడం, మెలిన వ్యాధి సమస్యతో తారకరత్న స్టిల్ ఇప్పటికి క్రిటికల్ కండిషన్ లోనే ఆయనకి నారాయణ హృదయాలయ వైద్యులు చికిత్సనందిస్తున్నారు. గత రెండు రోజులుగా నందనమూరి కుటుంబ సభ్యులు తారకరత్నని పరామర్శించేందుకు బెంగుళూరు తరలి వెళుతున్నారు. హీరోలు శివ రాజ్ కుమార్, మంచు మనోజ్ కూడా తారకరత్నని పరామర్శించేందుకు నిన్న ఆదివారం బెంగుళూరుకి వెళ్లారు. అయితే నిన్న ఆదివారం తారకరత్న శరీరం చికిత్సకి స్పందిస్తుంది అంటూ నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, శివ రాజ్ కుమార్ లు మీడియాతో చెప్పారు.
ఈరోజు తారకరత్నకు చెయ్యబోయే వైద్య పరీక్షలు కీలకం అని, అతని శరీరం వైద్యానికి స్పదింస్తున్నట్లుగా నారాయణ హృదయాల వైద్యులు ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం మరికొంతమంది డాక్టర్స్ నారాయణ హృదయాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం తారకరత్నకు ప్రత్యేకమైన టెస్ట్ లు చెయ్యబోతున్నారు. ఈ టెస్ట్ ల్లో ఆయన ఏ కండిషన్ లో ఉన్నారో తెలిసిపోతుంది. క్రిటికల్ లేదంటే అవుట్ అఫ్ డేంజర్ అనేది ఈరోజు చెయ్యబోయే వైద్య టెస్ట్ ల్లో తేలిపోనున్నట్లుగా తెలుస్తుంది. తారకరత్న కి గుండెపోటు వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయినప్పటినుండి నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.