Advertisement
Google Ads BL

ప్రభాస్-సిద్దార్థ్ మధ్యలో ఓ స్టార్ హీరో


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరోపక్క సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మొదలు పెట్టే యోచనలో ఉన్నారు. ప్రాజెక్ట్ కే షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అలాగే ఆదిపురుష్ ప్రభాస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఇవన్నీ ఈ ఏడాది అంటే 2023, 2024 లలో విడుదలైపోతాయి. మధ్యలో మారుతీ తో చిన్న మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ప్రభాస్ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణ సంస్థలో చెయ్యబోయే సినిమా ఒక ఎత్తు.

Advertisement
CJ Advs

మైత్రి వారు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ -ప్రభాస్ కలయికలో హ్యుజ్ బడ్జెట్ తో భారీగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-సిద్దార్థ్ ప్రాజెక్ట్ ఎప్పుడో ఓకె అయ్యింది. అఫీషియల్ ప్రకటనే రాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్-సిద్దార్థ్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ నటించబోతున్నాడనే న్యూస్ మాత్రం ప్రభాస్ ఫాన్స్ కి కునుకురానివ్వడం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హ్రితిక్ రోషన్ తలపడితే.. మాములుగా ఉండదు. ప్రభాస్-హ్రితిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఊహించని న్యూస్ అంటున్నారు. 

అయితే సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం.. ప్రభాస్ మూవీలో నటించేందుకు హ్రితిక్ రోషన్ తో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రభాస్-హ్రితిక్ కలయిక ఓకె అయితే ఆ మూవీపై అంచనాలు కొలవడం  కూడా కష్టమే సుమీ. 

 

Prabhas and Hrithik Combo Almost Confirmed:

Prabhas - Hrithik Roshan Multistarrer On Cards
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs