Advertisement
Google Ads BL

2024 సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్


పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలని వరసగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేస్తున్నారు. కానీ అవి ఎప్పుడు పూర్తవుతాయో అనేది మాత్రం తెలియదు. డిసెంబర్ లో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రేపు సోమవారం సుజిత్ తో చెయ్యబోయే మూవీని మొదలు పెట్టేందుకు ముహూర్తం పెట్టారు. అయితే హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ తేరి రీమేక్ అని ప్రచారం జరగడం, ఉస్తాద్ భగత్ సింగ్ మొదలైన కొత్తలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ తేరి రీమేక్ చెయ్యొద్దు అంటూ హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తూ నానారకాలుగా ఏడిపించారు.  

Advertisement
CJ Advs

దానితో హారిష్ శంకర్ బాగా నొచ్చుకున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అవునా.. కాదా అని అడిగితే.. దానికి హరీష్ శంకర్ తేరి రీమేక్ అవునా, కాదా అనేది వెండితెర మీద చూడాల్సిందే. ఎప్పటికప్పుడు నా ఆనందాన్ని నేను ఫాన్స్ తో షేర్ చేసుకునేవాడిని, మొన్న ఫాన్స్ చాలా అతి చేసారు. నేను చాలా హార్ట్ అయ్యాను. అసలు అది తేరి రీమేక్ అవునా, కాదా అనేది చెబుదామనుకున్నాను, ఈ సినిమా ఎందుకు తీస్తున్నాం, ఆ సినిమా ఎందుకు తియ్యడం లేదు అని చెబుదామనుకున్నాను, కానీ ఫాన్స్ టూ మచ్ గా బిహేవ్ చేసారు, నేను ఇప్పుడు ఆ విషయం చెప్పదలుచుకోలేదు.

మేము మా ప్లాన్ ప్రకారము ఉస్తాద్ భగత్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిల్మ్ ని రిలీజ్ చేస్తామంటూ హరీష్ శంకర్ పవన్ తో చెయ్యబోయే మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు.

Ustad Bhagat Singh release date fixed :

Ustad Bhagat Singh for 2024 Sankranti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs