Advertisement
Google Ads BL

సింగిల్ ఫ్రెమ్ లో మెగా ఫ్యామిలీ


మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ సింగిల్ ఫ్రెమ్ లో కనిపిస్తే మెగా ఫాన్స్ కి పూనకాలు, మీడియాకి ముచ్చట తీరిపోతుంది. చిరంజీవి-పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్. కానీ వీరిద్దరి కలయిక చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఫాన్స్ అంతగా ఎగ్జైట్ అయ్యేది. ఇక ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఆయన పార్టీ జనసేనని సపోర్ట్ చేస్తూ మట్లాడడం ఫాన్స్ కి మరింతగా నచ్చుతోంది. అయితే ఈ రోజు మెగా బ్రదర్స్ చిరు-నాగబాబు-పవన్ అమ్మగారు అన్నపూర్ణమ్మగారి పుట్టిన రోజు. అన్నపూర్ణమ్మగారి పుట్టినరోజు వేడుకలని మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా నిర్వహించింది.

Advertisement
CJ Advs

చిరంజీవి-నాగబాబు-పవన్ కళ్యాణ్-అలాగే వీరు చెల్లెళ్లు అందరూ ఒకే ఫ్రెమ్ లో ఉండి అమ్మకి అపురూపంగా విషెస్ చెప్పడమే కాదు, ఆమెతో కేక్ కట్ చేయించారు. తర్వాత రామ్ చరణ్, ఉపాసనలు పెద్దావిడ దగ్గర విడివిడిగా ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే మెగా ఫ్రెమ్ లో మెగా బ్రదర్స్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఉండేసరికి ఆ పిక్ కే అందం వచ్చేసింది. చిరు, నాగబాబు వాళ్ళ చెల్లెళ్లు అటు ఇటుగా నించుంటే.. పవన్ మాత్రం తల్లి వెనుకగా నిలబడి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరు తన తల్లి పుట్టినరోజు వేడుకలని ఈపిక్స్ రూపంలో షేర్ చేస్తూ మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ  పుట్టిన రోజు. 💐💐 జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ... 🙏Happy Birthday అమ్మ !! అంటూ ఆమెకి విషెస్ తెలియజేసారు.

Mega Family Adorable pic:

Megastar Chiranjeevi Celebrates His Mother Birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs