Advertisement
Google Ads BL

ఫామిలీస్ తో బెంగుళూరుకి ఎన్టీఆర్-కళ్యాణ్


తారకరత్న హెల్త్ కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉండడంతో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా బెంగుళూరుకి చేరుకుంటున్నారు. తారకరత్నకి గుండెపోటు వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసిన దగ్గర నుండి బాలకృష్ణ తారకరత్న దగ్గరే ఉన్నారు. నిన్న శనివారం చంద్రబాబు నాయుడు బెంగుళూర్ కి వెళ్లి తారకరత్నని పరామర్శించారు. పురందేరేశ్వరి, కళ్యాణ్ రామ్ అక్క, ఇంకా తారకరత్న వైఫ్, పాప, చైతన్య కృష్ణ, తారకరత్న కుటుంబ సభ్యులు అందరూ బెంగుళూరుకి వెళ్లి తారకరత్నని పరామర్శించి వస్తున్నారు. అందరూ వచ్చి తారకరత్నని చూసి వెళ్లిపోతున్నా బాలకృష్ణ మాత్రం అక్కడే తారకరత్న కుటుంబ సభ్యులకి అండగా ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈరోజు ఆదివారం ఉదయం కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ లు స్పెషల్ ఫైట్ లో బెంగుళూరుకి వెళ్లారు. కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిలతో కలిసి వారు బెంగుళూర్ కి తారకరత్నని చూసేందుకు వెళ్లారు. తారకరత్నని పరామర్శించిన తర్వాత ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు తిరిగి హైదరాబాద్ కి వచ్చేస్తారు.

ప్రస్తుతం తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. క్రిటికల్ కండిషన్ లో ఉన్న తారకరత్నకు మెలేనా కారణంగా చిన్న పేగు దగ్గర అధికంగా బ్లీడింగ్ అవుతున్నట్లుగా డాక్టర్స్ చెబుతున్నారు. తారకరత్నకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షులంలో తారకరత్న ఉన్నారు.

NTR and Kalyan Ram for Taraka Rathna:

NTR And Kalyan Ram Went To See Taraka Ratna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs