నిన్న శుక్రవారం ఉదయం లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్నని వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. తారకరత్నకు కార్డియా అరెస్ట్ జరగడంతో ఆయనని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే పల్స్ పడిపోవడంతో, సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయినట్లుగా డాక్టర్స్ తెలిపారు. అయితే తారకరత్నని మెరుగైన వైద్యం కోసం ముందుగా బెంగుళూరుకి తరలిస్తారని చెప్పినప్పటికీ.. నిన్న సాయంత్రం తారకరత్నని కుప్పం ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించాలని కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులే కుప్పం వస్తున్నారని అన్నారు.
అయితే తారక రత్నకి సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అని ఆయనకి ఆర్టిఫీషియల్ హార్ట్ అమర్చాలని డాక్టర్స్ చర్చించారు. కానీ మధ్యరాత్రి తారకరత్నని బెంగుళూరుకి షిఫ్ట్ చేసారు. అప్పటికే నారా చంద్రబాబు నాయుడు తారకరత్నని బెంగుళూరుకి షిఫ్ట్ చేసే విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రితో మట్లాడారు. ఇక నారాయణ హృదయాలయ వైద్యుల్లో డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో తారకరత్నకు వైద్యం స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. 48 గంటల పాటు తారకరత్న ఆరోగ్యంపై ఏం చెప్పలేమని డాక్టర్స్ కుటుంబ సభ్యులకి తెలిపినట్లుగా సమాచారం.
తారకరత్న ని ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలకృష్ణకి ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యం పై అరా తీసినట్లుగా తెలుస్తుంది.