Advertisement
Google Ads BL

బాలయ్యని కాపీ కొట్టిన బాలీవుడ్ స్టార్


టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, ఆయన మనసులో ఏమి దాచుకోకుండా బయటపెట్టేస్తారు అని ఆయనని అతి దగ్గరగా చూసిన వారు చెబుతుండే మాట. ప్రస్తుతం అన్ స్టాపబుల్ టాక్ షో తో అందరి మనసులని దోచేస్తున్న బాలకృష్ణకి కూసింత కోపమెక్కువ. ఆయన అభిమానులతో ఎంతగా కలిసిపోతారో కోపమొస్తే వాళ్ళ చెంప చెళ్లుమనిపిస్తారు. ఇష్టమైతే అభిమానులతో ఫొటోస్ దిగడానికి రెడీగా ఉంటారు. ఆయనకి నచ్చకపోతే ఇక అంతే. అంతేకాదు ఓ సినిమా ప్రెస్ మీట్ కి అతిధిగా వెళ్ళిన బాలయ్య తన చేతికి ఇచ్చిన ఫోన్ ని పక్కకి విసిరెయ్యడంతో అక్కడే ఉన్న చిత్ర యూనిట్ షాకయ్యింది. అలాగే ఆయన మట్లాడేటప్పుడు ఎవరైనా గట్టిగా అరిచి గోల చేస్తే ఆయనకి పుసుక్కున కోపమొచ్చేస్తుంది. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేరు. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు బాలకృష్ణని బాలీవుడ్ స్టార్ ఒకరు కాపీ చేసారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు నానా తంటాలు పడ్డాడు. రణబీర్ కపూర్ కూడా ఆ అభిమానితో ముందు సెల్ఫీ దిగడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ అభిమాని చేతిలో ఫోన్ సరిగ్గా పని చెయ్యలేదు. దానితో విసుగొచ్చిన రణబీర్ కపూర్ ఆ అభిమాని ఫోన్ తీసుకుని వెనక్కి విసిరేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

అది చూసిన నందమూరి ఫాన్స్ మా బాలయ్య ని చూసి రణబీర్ కాపీ కొట్టాడంటూ కామెంట్ చేస్తున్నారు. 

Ranbir Kapoor throws a fan phone:

Angry Ranbir Kapoor throws away fans phone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs