Advertisement
Google Ads BL

రమ్య నన్ను చంపేస్తుంది: నరేష్


సీనియర్ నటుడు నరేష్ గత ఏడాది పవిత్ర లోకేష్ తో కలిసి తిరుగుతూ మీడియాకి హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకుంటారని, ఆమెతో సహజీవనం చేస్తున్నాడంటూ ఆయన మూడో భార్య రమ్య రఘుపతి వాళ్ళని చాలాసార్లు వెంటాడుతూ మీడియా కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఈ న్యూ ఇయర్ కి నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నానంటూ ట్వీట్ చేసి ఓ వీడియో షేర్ చెయ్యడంతో వీరి పెళ్లి కన్ ఫర్మ్ అయ్యింది. అయితే రమ్యకి నరేష్ కోట్లలో భరణం ఇచ్చి విడాకులు తీసుకుని తెగతెంపులు చేసుకున్నాకే పవిత్రతో పెళ్లి పీటలెక్కుతున్నాడని ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

కానీ తనకి నరేష్ విడాకులివ్వలేదు, భరణంగా ఒక్క రూపాయీ ఇవ్వలేదు, వాళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారో అంటూ రమ్య రఘుపతి యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని ఛాలెంజ్ విసిరింది. అయితే రమ్యతో పాటుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పవిత్ర లోకేష్, నరేష్ లు సైబర్ క్రైం లో కంప్లైంట్ చేసి కోర్టుకెక్కారు. ఇప్పుడు తాజాగా నరేష్ తనమాజీ భార్య రమ్య తనని హత్య చేయించడానికి చూస్తుంది, అందుకోసం ఆమె రాకేష్ శెట్టి అనే వ్యక్తికి సుపారీ ఇవ్వడంతో అతను నా ఇంటి దగ్గర నన్ను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించాడంటూ నరేష్ కోర్టులో పిటిషన్ వెయ్యడం సంచలనంగా మారింది.

అంతేకాకుండా తన ఫోన్ కూడా హ్యాక్ చేసి తనని రమ్య బ్లాక్ మెయిల్ చేస్తుంది అని, తన హత్యకి కుట్ర చేస్తుంది అంటూ రమ్యపై నరేష్ ఆరోపణలు చేస్తూ తనతో విడాకులు ఇప్పించమని కోర్టుని కోరారు. మరి నరేష్ ఆరోపణలతో రమ్యకి నరేష్ కి కోర్టు విడాకులు మంజూరు చేస్తుందేమో చూడాలి.

Naresh: Ramya Plotting to Kill Me:

Ramya Plotting to Kill Me: Sr Naresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs