బాలీవుడ్ లో హిట్ కోసం అక్కడి స్టార్స్, మేకర్స్ మొహం వాచిపోయి ఉన్నారు. అసలే నెటిజెన్స్ నుండి నెగిటివిటీతో సతమతమవుతున్న వారికి సినిమాలు కూడా ఆడకపోయేసరికి మరింత టెన్షన్ పట్టుకుంది. హిందీ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలని ఆదరిస్తూ బాలీవుడ్ మూవీస్ కి ఈకలు పీకుతూ విమర్శించడంతో హిందీ ఇండస్ట్రీపై ఒత్తిడి ఎక్కువైపోయింది. అక్కడ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు పండగ చేసుకుంటున్నారు. గత ఏడాది ఒకటి రెండు హిట్స్ తో అతలాకుతలమైన బాలీవుడ్ ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ తో పుంజుకుంది. పఠాన్ మూవీ రెండు రోజుల క్రితమే విడుదలైంది. పఠాన్ కి యావరేజ్ టాక్ స్ప్రెడ్ అయినా కూడా అక్కడి విశ్లేషకులు తమ భాష మీద గౌరవాన్ని, అతి ప్రేమని చూపిస్తూ 4.5/5 రేటింగ్స్ ఇస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేసారు.
అంటే యావరేజ్ సినిమా అయినా రేటింగ్ ఎక్కువ ఇచ్చేస్తే.. అందులోను ప్రముఖ క్రిటిక్స్ ఇలా చేస్తే ఏ ప్రేక్షకుడైన సినిమాలో విషయముంది అనుకోవడం సహజమే కదా. అయితే పఠాన్ కి యారేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా కొత్త నెంబర్లు నోట్ చెయ్యడంతో సినిమా గ్యారెంటిగా సూపర్ హిట్ అవడం ఖాయం. పఠాన్ చూసిన సౌత్ ప్రేక్షకులు మాత్రం ఆ ఏముంది పఠాన్ లో దాని కన్నా టాలీవుడ్ నుండి రీసెంట్ గా వచ్చిన వాల్తేర్ వీరయ్య బావుంది అంటూ పెదవి విరుస్తున్నారు.
ఐదేళ్ల తర్వాత షారుఖ్ ఈ రేంజ్ ఎంట్రీకి అభిమానులు బాగా ఫిదా అయ్యారు. అందులోను కొడుకు విషయంలో షారుఖ్ కి సింపతీ వర్కౌట్ అవ్వడంతోనే యావరేజ్ ని హిట్ చేసారు. బాలీవుడ్ వాళ్ళ అతి చూసారా యావరేజ్ సినిమాకే ఇంత ఎక్కువ చేస్తున్నారు అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ రేజ్ చేస్తున్నారు.