Advertisement
Google Ads BL

జమున మృతి పట్ల బాలయ్య సంతాపం


సీనియర్ నటి జమున ఈ రోజు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని తన నివాసంలో అనారోగ్య కారణాలతో కన్ను మూసారు. జమున మృతి పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జమున మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసారు.

Advertisement
CJ Advs

అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు... నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి... వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను... వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. అంటూ ట్వీట్ చేసారు.

Nandamuri Balakrishna condolence on Jamuna:

Yesteryear actress Jamuna passes away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs