Advertisement
Google Ads BL

సీనియర్ నటి నటి జమున కన్నుమూత


సీనియర్ నటి నటి జమున ఈరోజు శుక్రవారం కన్నుమూశారు. జమున వయసు 86 సంవత్సరాలు. జమున హైదరాబాద్లో బంజారాహిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు. 1936 ఆగస్టు 30 కర్ణాటకలోని హంపిలో జన్మించిన ఆవిడ.. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1953 పుట్టినిల్లు సినిమాతో ఆమె వెండితెర అరంగేట్రం చేసారు. మిస్సమ్మ సినిమాతో జమున మొదటిసారిగా గుర్తింపు పొందారు. సంతోషం, మిస్సమ్మ, దొంగరాముడు, భాగ్య రేఖ, గుండమ్మ కథ సినిమాలతో జమున తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. అలనాటి అగ్రనటులందరితో ఆమె కలిసి నటించారు. వెండితెర సత్యభామగా జమునకు పేరుంది.

Advertisement
CJ Advs

1986 లలో రాజమండ్రి నుండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన జమున రాజకీయాలకూ సుపరిచితురాలు. జమున మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Veteran Actress Jamuna Passes Away:

Veteran actress Jamuna no more
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs