టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్, స్టార్ హీరోలు కోకొల్లలు. కానీ వారు హీరోయిజానికి మ్యాచ్ అయ్యే విలన్స్ మాత్రం కరువయ్యారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఇలా కొంతమంది విలన్స్ ని పదే పదే రిపీట్ చెయ్యడంతో ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతున్నారు. అందులోను సంక్రాంతి సినిమాలు చూసాక ఖచ్చితంగా టాలీవుడ్ కి కొత్త విలన్స్ కావలెను అని అనిపించేలా ఉన్నాయా సినిమాలు. వీర సింహారెడ్డి కానివ్వండి, వాల్తేర్ వీరయ్య కానివ్వండి, ఆఖరికి డబ్బింగ్ మూవీ వారసుడులోను విలన్స్ వీకైపోవడమే కాదు, అసలు వాళ్ళని విలన్స్ గా చూసి చూసి చిరాకు పడుతున్నారు జనాలు .
అందులోను బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ హీరోయిజం ముందు వాళ్ళ విలనిజం తేలిపోయింది. ప్రకాష్ రాజ్ పాత్రలు వాల్తేర్ వీరయ్య, వారసుడులో చూసి బాబోయ్ ప్రకాష్ రాజ్ ఏంట్రా నాయన ఎన్నో సినిమాల్లో చూసేసిన విలన్ పాత్రల్లో చూపించారంటూ నెటిజెన్స్ పెదవి విరిచారు. ఇక వీరసింహారెడ్డిలో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్ర ముందు దునియా విజయ్ తేలిపోయాడు. అఖండలో శ్రీకాంత్ కూడా బాలయ్య ముందు తేలిపోయాడు.
కానీ ఇప్పడు ఇక్కడ తెలుగులో విలన్ పాత్రలకు నటులు కరువయ్యారు. పాత వారినే పెడుతుంటే పాత చింతకాయపచ్చడిలా ఆడియన్స్ ఫీలవుతున్నారు. అలాగే విలన్ పాత్రలు కూడా కొత్తగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. లైక్ ధ్రువలో అరవింద్ స్వామిలా, సవ్యసాచిలో మాధవన్ ఇలా కొత్తగా కావాలంటున్నారు. మరి దర్శకులు కూడా ఆడియన్స్ అడిగిన దానిపై ఫోకస్ పెట్టాల్సిన సమయమిది. లేదంటే హీరోయిజం ఎంతగా ఎలివేట్ చేసినా పక్కన పవర్ ఫుల్ విలన్ లేకపోతె హీరోల పాత్రలు తేలిపోగలవు.