Advertisement
Google Ads BL

అక్కినేనిపై వ్యాఖ్యలు: బాలయ్య రియాక్షన్


మొన్నామధ్యన బాలకృష్ణ వీరసింహారెడ్డి సెలెబ్రేషన్స్ పార్టీలో ఆ రామ రావు, ఈ రంగా రావు, అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫాన్స్ భగ్గుమంటున్నారు. అక్కినేని యంగ్ హీరోలు బాలకృష్ణ పేరెత్తకుండా వీరంతా కళామతల్లి ముద్దుబిడ్డలంటూ ఓ ప్రెస్ నోట్ వదిలారు. అక్కినేని ఫాన్స్ ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణని  బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేసారు. అయితే తాజాగా బాలకృష్ణ మీడియాతో మట్లాడుతూ అక్కినేని, తొక్కినేని వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తాను ఏదో ఫ్లో లో అన్న మాటలను పట్టుకుని రాద్ధాతంతం చేస్తున్నారంటూ బాలకృష్ణ తేల్చేసారు.

Advertisement
CJ Advs

అక్కినేని నాగేశ్వరరావుని బాబాయ్ అని పిలుచుకుంటాను. ఆయన తన పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు, బాబాయ్ పట్ల నా గుండెల్లో ఎంతో ప్రేమ ఉంది, బయట ఏవో అంటుంటారు, అవన్నీ నేను పట్టించుకోను, ఎన్టీఆర్ అలాగే ఏఎన్నార్ లను అభిమానంతో ఫాన్స్ ఎలా పిలుస్తారో తెలిసిందే. రామారావును అభిమానంతో ఎన్టీవోడు అంటారు. ఏఎన్నార్ ను నాగిగాడు అంటూ పిలుస్తుంటారు, మనం అనుకోకుండా ఏదో మట్లాడేస్తాము, ప్రేమ కొద్దీ అంటాము కానీ, కావాలని మాట్లాడము. కాదు అది తప్పే అని ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు అంటూ బాలకృష్ణ అక్కినేని-తొక్కినేని వ్యాఖ్యల వివాదాన్ని తేల్చేసారు.

Balayya Clarifies On Akkineni Controversy:

Akkineni-Tokkineni: Balakrishna backtracks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs