హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నారనే విషయం వాళ్ళు చెప్పకపోయినా ముంబై మీడియా పదే పదే వారి ప్రేమని, వారి డేటింగ్ ని కన్ ఫర్మ్ చేస్తూనే ఉంది. మహాసముద్రంలో నటించినప్పుడే ఆ సినిమా సెట్స్ లోనే సిద్ధుకి అదితికి మధ్యన ప్రేమ మొదలయ్యింది అనే న్యూస్ ని నిజం చేస్తూ సిద్దార్థ్ అలాగే అదితి హైదరిలు ముంబై లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చాలాసార్లు వీరిద్దరూ ముంబై ఫోటో గ్రాఫర్స్ కి చిక్కారు. అలాగే రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో హీరో శర్వానంద్ ని బాలయ్య సిద్దు ప్రేమ విషయం కదిపారు. నువ్వు సినిమాలో అదితిని జోడి చేసుకుంటే.. అతను రియల్ లైఫ్ లో జోడి చేసుకున్నాడంటూ బాలయ్య కామెంట్స్ చేసారు.
అయితే తాజాగా సిద్దార్థ్ అలాగే అదితి రావు లు హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన శర్వానంద్-రక్షిత శెట్టిల నిశ్చితార్ధం వేడుకకి టాలీవుడ్ నుండి సెలబ్రిటీస్ చాలామంది హాజరయ్యారు. మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్-ఉపాసన, నాగార్జున-అమల, రానా, నితిన్, నాగ శౌర్య, ఇంకా యంగ్ హీరోస్, శర్వాతో కలిసి పనిచేసిన దర్శకులు.. అలాగే సిద్దు-అదితి లవ్ బర్డ్స్ లా హాజరు కాగా.. అందరి కన్నా సిద్దు-అతిధిలు జంటగా శర్వానంద్ నిశ్చితార్ధపు ఫ్రెమ్ లో స్పెషల్ గా మెరవడం చూసిన వారు నెక్స్ట్ సిద్దు-అదితి పెళ్లి పీటలెక్కుతారేమో అంటూ గుసగుసలు మొదలు పెట్టేసారు.
అదితి ఈ వేడుకకి ట్రెడిషనల్ గా సారీ లో హాజరు కాగా.. సిద్దార్థ్ మాత్రం వైట్ పంచెలో పద్దతిగా కనిపించాడు. ప్రస్తుతం సిద్దు-అదితిలు జంటగా వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.