Advertisement
Google Ads BL

శర్వా ఎంగేజ్మెంట్ లో రామ్ చరణ్ దంపతులు


హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కుతున్నాడనగానే శర్వా చేసుకోబోయే అమ్మాయెవరా అని అందరూ గూగుల్ లో తెగ వెతికేసారు. ఇన్నాళ్లు వెయిట్ చేసి శర్వానంద్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో మొదలైంది. ఆ అమ్మాయి బ్రాగ్రౌండ్ ఏమిటి? అసలు శర్వా అంతగా ఇష్టపడిన అమ్మాయి అంత అందంగా ఉంటుందా? అంటూ చాలామంది ఆరాలు మొదలు పెట్టారు. అయితే శర్వానంద్ ప్రేమించి పెళ్లి చేసుకోబోయే పొలిటికల్ ఫ్యామిలీ పిల్లనే. ఏపీ మాజీ మంత్రి బొజ్జల రామకృష్ణరైడ్డి మనమరాలు హై కోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డిని శర్వా ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఈరోజు గురువారం రిపబ్లిక్ డే రోజు శర్వానంద్-రక్షితల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. సింపుల్ గా శర్వానంద్-రక్షిత రెడ్డిల ఎంగేజ్మెంట్ జరగగా.. దానికి శర్వా బెస్ట్ ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. శర్వా-రక్షిత రెడ్డి లతో రామ్ చరణ్ ఇంకా ఉపాసనల పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే శర్వానంద్ కాబోయే భార్య రక్షిత రెడ్డి ఇప్పుడు ఇలా నిశ్చితార్ధం ఫోటోలోనే రివీల్ అయ్యింది. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వా-రక్షిత ల వివాహం అతిత్వరలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

Ram Charan and his Wife attends Sharwanand engagement:

Sharwanand gets engaged
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs