Advertisement
Google Ads BL

అనుష్క పేరుతో మేనేజర్ భారీ మోసం


హీరోయిన్ అనుష్క చాన్నాళ్లుగా మీడియాకి కనిపించడం లేదు. గత మూడేళ్లుగా అనుష్క నిశ్శబ్దంగానే కనబడుతుంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో సినిమా చేస్తున్న అనుష్క ఆ మూవీలో షెఫ్ గా కనిపించబోతుంది. కొద్దిరోజులుగా సైలెంట్ గా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న అనుష్క పేరు ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. కారణం సినిమా ఇండస్ట్రీలో అనుష్క మేనేజర్ అంటూ ఎల్లారెడ్డి అనే వ్యక్తి చేసిన భారీ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అనుష్క మేనేజర్ అని చెప్పుకుంటూ అనుష్క డేట్స్ ఇప్పిస్తానంటూ ప్రొడ్యూసర్ లక్ష్మణాచారీ‌ అనే వ్యక్తిని నమ్మించాడు. అందులో భాగంగానే అనుష్క అపాయింట్‌మెంట్ దొరికిందంటూ చాలాసార్లు లక్ష్మణాచారిని బెంగళూరు కి తీసుకువెళ్లగా.. తీరా వెళ్లిన తర్వాత చివరి నిమిషంలో అనుష్క రాలేదంటూ నమ్మించాడట.

Advertisement
CJ Advs

అలా అప్పుడప్పుడు ఎల్లా రెడ్డి ఆ లక్షణాచారి నుండి 26 లక్షలు దాకా వసూలు చేసాడట. అనుష్క మాత్రమే లేకుండా మణిశర్మ డేట్స్ ఇప్పిస్తానంటూ లక్షణాచారి నుండి ఎల్లారెడ్డి మరికొంత డబ్బు వసూలు చేసాడట. కానీ రోజులు గడుస్తున్నా అనుష్క, మణిశర్మల ఆప్పోయింట్మెంట్స్  దొరకడం లేదని నమ్మబలికాడట. కానీ చివరికి లక్ష్మణరెడ్డి తాను మోసపోయానని గ్రహించి పోలీస్ ల కన్నా ముందు ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చెయ్యగా ఎల్లారెడ్డి డబ్బు మొత్తం ఇచ్చేసి సెటిల్ చేస్తానని ఒప్పుకున్నాడట.

రోజులు గడిచిపోతున్నా ఎల్లా రెడ్డి తన డబ్బు తనకి ఇవ్వకుండా తప్పించుకుతిరగడమే కాకుండా, డబ్బులు ఇవ్వనని బెదిరిస్తున్నట్లు ప్రొడ్యూసర్ లక్ష్మణాచారి పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. తన ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తానని కూడా రివర్స్‌లో ఎల్లారెడ్డి బెదిరిస్తున్నట్లు లక్ష్మణాచారి పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది..

Manager in the name of Anushka is a huge fraud:

Calling Anushka manager is a huge scam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs