రాజమౌళి డైరెక్షన్ లో దానయ్య నిర్మించిన ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవడం పట్ల ఇండియా వైడ్ ప్రేక్షకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ ఇప్పటికే అమెరికా గోల్డెన్ గ్లొబ్ పురస్కారం అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో ఆర్.ఆర్.ఆర్ సాంగ్ ఉండడంతో అందరూ ఆ పాటకి ఆస్కార్ రావాలని కోరుకుంటూ టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతమంది ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని పొగిడేస్తుంటే.. మరోపక్క అదే స్థాయిలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని విమర్శిస్తున్నారు.
కారణం ఆర్.ఆర్.ఆర్ కి ఎలాంటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కినా కేవలం దర్శకుడి రాజమౌళి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అలాగే హీరోలు రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు ఆ క్రెడిట్ కి అర్హులుగా కనబడుతున్నారు.. తప్ప మిగతా ఎవరూ కనిపించడం లేదు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన DVV దానయ్య అస్సలు కానరావడం లేదు. మరి రాజమౌళి అండ్ కో దానయ్యని లైట్ తీసుకున్నారో.. లేదంటే దానయ్య వీళ్ళతో కలవడం లేదో, అలాగే ఆ సాంగ్ రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ ని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ ని ఎంతో కష్టపడి తెరకెక్కించి ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేసి సినిమాని హిట్ చెయ్యొచ్చు. కానీ దానికి మూలం నిర్మాతే. ఆ నిర్మాతనే నెగ్లెట్ చేస్తే ఎలా రాజమౌళి గారూ అంటూ రాజమౌళిని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు మీ ఫ్యామిలీ, హీరోలే కనబడుతున్నారు కానీ.. దానయ్య ఏ ఫ్రేమ్ లోను లేకపోవడం బాధకారమంటున్నారు. మరి ఈ విషయంపై రాజమౌళి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.