Advertisement
Google Ads BL

మంచు వారి కోడలి కొత్త బిజినెస్


మంచు మోహన్ బాబు కోడలు, మంచు విష్ణు భార్య విరానికా గురించి తెలియని వారుండరు. మంచు విష్ణు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న కుమార్తె విరానికాని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. విరానికా మంచు ఫ్యామిలీలోకి అడుగుపెట్టాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచు విష్ణు తన వ్యాపారాలు, విద్యారంగంలో సత్తా చాటుతూ తన కెరీర్ వైపు పరుగులు తీస్తుంటే విరానికా నలుగురు పిల్లలని చూసుకుంటూ, ఇంటిని చక్కబెడుతూనే వ్యాపారరంగంలో ప్రత్యేకతని చాటుతుంది. మైసన్ అవా కిడ్స్ బ్రాండ్ వంటి డిజైనర్ క్లాతింగ్ బ్రాండ్ లో ఇప్పటికే సక్సెస్ అయిన విరానికా మరోవైపు న్యూయార్క్ అకాడమీ ఇంటర్నేషన్ స్కూల్ ని రన్ చేస్తుంది. ది కేక్ రూమ్ బేకరీ రంగంలోనూ విరోనికా అడుగుపెట్టారు.

Advertisement
CJ Advs

తాజాగా విరానికా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. విరానికా బ్రైడల్ కలెక్షన్ పేరుతొ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ బ్రాండ్‌ తయారీ గురించి విరానికా తెలియజేసారు. చేతితో ఎంబ్రాయిడరీ పట్టుచీరలు డిజైన్ చేస్తారు. ఒక్కో చీరని డిజైన్ చెయ్యడానికి దాదాపు 75 రోజులు సమయం పడుతుంది. కొన్ని చీరలు 45 రోజుల్లోనూ పూర్తవుతాయి. జరీ, గోల్డ్, టిష్యు ఇలా రకరకాల మెటీరియల్స్ సారీ తయారు చేసేందుకు వాడతారట. వీటిని నెలలపాటు కష్టపడి చేతితో అందంగా తయారు చేస్తారు. ఈ చీరలు ఒక్కొక్కటి 20 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. 

విరానికా బ్రైడల్ కలెక్షన్ శారీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ మెరిసిన వీడియోని షేర్ చేస్తూ ఆ సారీ తయారీ గురించి విరానికా ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చారు. మృణాల్ ఠాకూర్ ధరించిన ఆ సారీ జరీ, గోల్డ్, టిష్యుతో తయారు చెయ్యడానికి 980 గంటల సమయం పట్టిందని, అంటే రెండు నెలలకు పైగా సమయం పట్టినట్లుగా తెలియజేసారు. నిజంగా విరానికా బ్రైడల్ సారీ లో హీరోయిన్ మృణాల్ మెరిసిపోతుంది అంటే నమ్మాలి.

Manchuvari Kodali New Business:

Manchu Viranica Enters Into Bridal Collection Business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs