వీరసింహారెడ్డి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆ రంగారావు ఈ రంగా రావు.. అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అక్కినేని, రంగారావు లాంటి నటులని వెక్కిరించడం ఎంతవరకు సబబు అంటూ విమర్శిస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫాన్స్ ఫైర్ అయ్యారు. అసలు ఇప్పటికే బాలకృష్ణకి అక్కినేని నాగార్జునకి పడదు, అందుకే బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినా చూడడానికి రాలేదు అంటారు. అలాగే బాలకృష్ణ-నాగార్జున కలిసి ఒకే స్టేజ్ పై కనిపించడం చాలా అరుదు కూడా. ఇప్పుడు బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకి అక్కినేని ఫాన్స్ మాత్రమే కాదు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అక్కినేని హీరోలు కూడా బాలకృష్ణ అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలియజేస్తూ ప్రెస్ నోట్ వదలడం హాట్ టాపిక్ పైగా మారింది. #ANRLiveson అంటూ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు, వారిని అగౌరవ పరచరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ లు విడి విడిగా ప్రెస్ నోట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.