అఖిల్ ఏజెంట్ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్కే కానీ.. ఏజెంట్ చిత్ర బృందం మాత్రం కామ్ గా ఉంటుంది. ఏజెంట్ విషయంలో అఖిల్ స్టిల్స్ ఓ టీజర్ తప్ప ఇంతవరకు మరో పోస్టర్ లేదు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో భాగమయ్యారు. అఖిల్ మోస్ట్ బ్యాచులర్ హిట్ విషయం కూడా ప్రేక్షకులు మరిచిపోయారు. కానీ ఏజెంట్ అప్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ ఇంకా ఇంకా ప్రేక్షకులని వెయిట్ చేయిస్తున్నారు. న్యూ ఇయర్ రోజున సమ్మర్ రిలీజ్ అంటూ చెప్పారు కాని.. ఇంతవరకు ఆ డేట్ ఇవ్వలేదు.
ఇప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఏజెంట్ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజ్ డేట్ ఉండొచ్చని.. ఏప్రిల్ లో రావాల్సిన AK ఎటెర్టైన్మెంట్ వారి చిరు భోళా శంకర్ ని అఖిల్ ఏజెంట్ కోసం వాయిదా వెయ్యొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి. మరి అఖిల్ ఏజెంట్ ని భోళా శంకర్ డేట్ కి లాక్ చేస్తారేమో చూడాలి. జనవరి 26న ఇవ్వబోయే ఏజెంట్ డేట్ కోసం అక్కినేని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇంతవరకు హీరోయిన్ సాక్షి వైదే కేరెక్టర్ ఎలా ఉంటుంది. ఆమె లుక్ విషయంలో క్లారిటీ లేదు. అందుకే ఫాన్స్ ఆ విషయంలో మేకర్స్ పై ఆగ్రహంగానే ఉన్నారు. కనీసం ఏజెంట్ డేట్ పోస్టర్ లో అయినా అఖిల్-సాక్షి కాంబో పోస్టర్ వదలాలని అభిమానులు కోరుకుంటున్నారు.