బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి క్రికెటర్ KL రాహుల్ లు కొన్నాళ్లుగా ప్రేమలో ఉండి.. నేడు జనవరి 23 న పెళ్లితో ఒక్కటయ్యారు. సునీల్ శెట్టి కుమార్తె పెళ్లిని తన సొంతూరు మహారాష్ట్రలోని కాండాలలో సొంత ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరిపించాడు. గత రెండు రోజులుగా కాండాలలో అతియా శెట్టి-రాహుల్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్ళికి ఎవరెవరు హాజరయ్యారు, బాలీవుడ్ నుండి ఏయే సెలబ్రిటీస్ వెళ్లారు, రాహుల్ పెళ్ళికి ఆయన దోస్త్ లు, టీమ్ ఇండియా క్రికెటర్స్ ఎవరెవరు వచ్చారు అన్న విషయంలో అభిమానులకి క్లారిటీ లేదు కానీ.. అక్కడ జరిగే వేడుకలు వీడియోస్ లీకుల రూపంలో కనిపించడంతో అవి చూసి ఆనందించేసారు.
ఇక నేడు జనవరి 23 అథియా-రాహుల్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. KL రాహుల్ అతియా శెట్టిల పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అతియా శెట్టి మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవడమే కాదు.. భార్యగా మారిన అతియా శెట్టి చేతిని రాహుల్ ముద్దాడుతున్న పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మండపం సింపుల్ గా కనబడుతున్నా పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు మాత్రం పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. మరి మీరూ అతియా-రాహుల్ పెళ్లి ఫొటోస్ ని ఓ లుక్కెయ్యండి.