Advertisement
Google Ads BL

పెళ్లికి రెడీ అయిన కార్తీక దీపం విలన్


స్టార్ మా లో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ సీరియల్ గా మారిన కార్తీకదీపం ఎట్టకేలకి ఈరోజు సోమవారంతో ముగియబోతుంది. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ గా నిరుపమ్ పరిటాల, దీప వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ కనిపించగా పవర్ ఫుల్ విలన్ మోనిత పాత్రలో శోభా శెట్టి అదరగొట్టేసింది. ఈ సీరియల్ మొత్తం కార్తీక్-దీప-మోనిత చుట్టూనే తిరిగింది. మోనిత అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో ఒకరకమైన ద్వేషం కలిగేలా ఆమె పాత్రని దర్శకుడు రాసాడు. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ పాత్ర అంటే ప్రేక్షకులని ఎనలేని ఇష్టం. కార్తీక దీపం అయ్యిపోతుంది అంటే ఎంతోమంది బుల్లితెర అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

Advertisement
CJ Advs

అటు రేటింగ్స్ పరంగాను స్టార్ మాకి ఈ సీరియల్ ఎప్పుడూ టాప్ లోనే ఉండేది. ఇక కొద్దిరోజుల క్రితం మోనిత కేరెక్టర్ షూట్ అయ్యిపోయింది అంటూ శోభా శెట్టి కార్తీక దీపంలో తన లాస్ట్ డే సన్మానంపై వీడియో పోస్ట్ చేసింది. అప్పుడే ప్రేక్షకులు బాగా ఫీలయ్యారు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ ముగియబోతుంది. కార్తీక దీపం సీరియల్ ముగిసే రోజు విలన్ మోనిత తన పెళ్లి వార్త చెప్పడం ప్రేక్షకులకి ఎగ్జైట్మెంట్ కలిగించింది. అవును శోభా శెట్టి పెళ్లి కూతురు కాబోతుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా శోభా శెట్టి పెళ్లి చూపులకి తయారవుతున్న విషయాన్ని బయటపెట్టింది.

ఈరోజు మా అమ్మ నాదగ్గరికి వచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పి షాకిచ్చింది. పెళ్లి కొడుకు ఎవ్వరో కూడా తెలియదు. కానీ పెళ్లి చూపుల కోసం రెడీ అవుతున్నాను.. అది కూడా నా పుట్టిన రోజునాడు, ఈరోజు మా ఇంట్లో వ్రతం కూడా జరుగుతుంది అంటూ శోభ శెట్టి షేర్ చేసిన వీడియో చూసి.. కార్తీక దీపం ముగుస్తుంది.. విలన్ మోనిత పెళ్లి పీటలెక్కుతుంది అంటూ నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Kartheeka Deepam Fame Shobha Shetty Marriage Details:

Na Pelli Chupulaku Ela Ready ayyanu: Shobha Shetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs