Advertisement
Google Ads BL

బిగ్ బాస్ విన్నర్ రేవంత్ సారి చెప్పాడు: గీతు


బిగ్ బాస్ సీజన్6 హౌస్ లో టాప్ 2 లో ఖచ్చితంగా సింగర్ రేవంత్-గలాటా గీతు ఉంటారనుకున్నారు. ఫైనల్ పోరు వారి మధ్యలోనే ఉంటుంది అన్నారు. ఫిజికల్ టాస్క్ ల పరంగా రేవంత్ నెంబర్1 అయితే.. తెలివితేటలతో గేమ్ ని లీడ్ చేసే సత్తా గీతు రాయల్ ది. వీరి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది అని ఊహించుకున్నారు. వారు ఫ్రెండ్లిగా ఉంటూనే ఒకరిని ఒకరు విమర్శించుకునేవారు. అలాగే ఒకరినిఒకరు నామినేట్ చేసుకునేవారు. గీతు రేవంత్ మీద అరిచేది, రేవంత్ కూడా అరిచేవాడు. తర్వాత ఫ్రెండ్స్ అయినా వారిమధ్యలో కోల్డ్ వార్ జరుగుండేది అనిపించేది. అయితే గీతు హౌస్ నుండి బయటికి వచ్చేసినప్పుడు రేవంత్ బాగా ఏడ్చాడు. ఆ కన్నీళ్ళకి అతని పాటకి కరిగింది గీతు.

Advertisement
CJ Advs

అయినా రేవంత్ తన వెనుక తన గురించి నెగెటివ్ గా మాట్లాడడంతో గీతు కాస్త కోపంగానే ఉంది. ఇక రేవంత్ విన్నర్ అయ్యి బయటికి వచ్చాడు. గ్రాండ్ ఫినాలేలోను రేవంత్ గురించి గీతు ఏమి మాట్లాడలేదు. అయితే రేవంత్ తన కూతురిని చూసిన మొదటి క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే రేవంత్ కి గీతు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పి.. తన వెనుక మట్లాడడం తనకి నచ్ఛలేదు అని చెప్పిందట. అప్పుడు రేవంత్ కూడా పాజిటివ్ గానే స్పందించి నేను నిన్ను ఏమి అనలేదు. ఒకవేళ అలాంటి కంటెంట్ ఏమైనా బయటికి వచ్చి నువ్వు హార్ట్ అయ్యి ఉంటే సారి గీతు అని చెప్పాడట. 

ఒక ఇండియా ఐడల్ అయ్యుండి నాకు రేవంత్ సారి చెప్పాడు, అప్పుడే అన్ని మర్చిపోయాను, అప్పటి నుండి రేవంత్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అంతకుముందు ఆది రెడ్డి, ఫైమా తర్వాత శ్రీహన్, శ్రీ సత్యలు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ రేవంత్ చేసింది తప్పేమో అని తెలుసుకుని సారి చెప్పడం నచ్చింది. అందుకే ఫ్రెండ్లిగా ఉంటున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Galatta Geetu about Singer Revanth:

Galatta Geetu about Singer Revanth friendship 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs