మెగాస్టార్ చిరంజీవి-రవితేజ కలయికలో ఈ సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో తెరకెక్కి బాలకృష్ణ వీరసింహారెడ్డి తో పోటీ పడిన వాల్తేర్ వీరయ్య మూవీ విడుదలైన కొద్ది గంటలకే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకోగా.. సినీ విశ్లేషకులు సైతం వాల్తేర్ వీరయ్కకి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. కానీ రెండో ఆటకే వాల్తేర్ వీరయ్య బావుంది అంటూ అభిమానులు, మాస్ ఆడియన్స్ టాక్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసారు. కానీ కొంతమంది సినీ విశ్లేషకులు కావాలనే వాల్తేర్ వీరయ్కకి 2 రేటింగ్, అలాగే 2.25 రేటింగ్స్ ఇచ్చి వాల్తేర్ వీరయ్య సినిమాని ప్లాప్ చెయ్యాలని ప్రయత్నం చేసారు.
కానీ వాల్తేర్ వీరయ్యని రేటింగ్స్ ఆపలేవు. వీరయ్య కలెక్షన్స్ ముందు మీ రేటింగ్ దిగదుడుపే అన్నట్టుగా వాల్తేర్ వీరయ్య ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచి సినిమా ప్లాప్ అన్న నోళ్లను మూపించింది. వాల్తేర్ వీరయ్య బాలేదు, అందులో పస లేదు అంటూ పూర్ రేటింగ్ ఇచ్చిన వారే వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్ నెంబర్లు ఏరియాల వారీగా రాస్తూ వీరయ్య ముందు అంతా దిగదుడుపే, వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్ ప్రభంజనం, పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ హిట్ కొట్టేశారంటూ పొగిడారు. అయితే వెబ్ సైట్స్ వాల్తేర్ వీరయ్యకి కావాలనే పూర్ రేటింగ్ ఇచ్చిన విషయంలో మెగా కాంపౌండ్ కాస్త కోపంగా వుంది అనే టాక్ కూడా వినిపించింది. అయితే వాల్తేర్ వీరయ్య 2.2 మిలియన్ గ్రాస్ సాధించడంతో.. చిరు కాస్త సెటైరికల్ గా స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యకి సినీ విశ్లేషకులు ఇచ్చిన రివ్యూ రేటింగ్స్ పై డైరెక్ట్ గా సెటైర్స్ వేశారు. చిన్న జోక్ చెబుతాను. ఎవ్వరిని critisize చెయ్యడానికి కాదు టెక్ ఇట్ ఈజీ! వెబ్ సైట్స్ (వాల్తేర్ వీరయ్యకి) 2.25 అలా రేటింగ్స్ ఇచ్చాయి. వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఏమిటో తెలుసా 2.25 అంటే.. మిలియన్స్ అని.. 2.25 మిలియన్స్ అని తర్వాత అర్ధమైంది అంటూ వాల్తేర్ వీరయ్య 2.2 మిలియన్ పోస్టర్ ని షేర్ చేస్తూ మెగాస్టార్ తనదైన స్టయిల్లో సెటైర్ వేశారు.