నందమూరి నటసింహం ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. సినిమా విడుదల తర్వాత టాక్, రేటింగ్స్ పూర్‌గా వచ్చినప్పటికీ.. సంక్రాంతికి ఈ మాస్ బొమ్మ కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్‌ని రాబట్టి.. బాక్ టు బాక్ హిట్‌గా బాలయ్య ఖాతాలో ఈ సినిమా నిలబడింది. అయితే ఇదే టైమ్‌లో ‘అఖండ’తో బాలీవుడ్‌లో డబ్బింగ్ ప్రయోగం కూడా చేశారు.
ఈ డబ్బింగ్ ప్రయోగం పెద్దగా వర్కవుట్ అవలేదని తెలుస్తుంది. తెలుగులో ‘అఖండ’ చిత్రం ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రం డిజాస్టర్ అనేలా టాక్ వినబడుతోంది. దాదాపు రూ. 7 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. తొలిరోజు కేవలం రూ. 50 లక్షలు మాత్రమే రాబట్టిందని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘పఠాన్’ హవా మొదలైంది. అడ్వాన్స్ బుకింగే రికార్డులు క్రియేట్ చేస్తుంది. ‘పఠాన్’ మేనియాలో ‘అఖండ’ని ఎవరూ పట్టించుకోవడం లేదనేలా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.
అయితే తెలుగులో ఘన విజయం సాధించిన ‘అఖండ’ చిత్రం బాలీవుడ్‌లో దారుణ పరాజయానికి కారణం డబ్బింగ్ అని తెలుస్తుంది. బాలయ్య డైలాగ్స్ పవర్‌ని అక్కడ డబ్బింగ్ అందుకోలేకపోయిందని.. అందుకే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి కనబరచడం లేదనేలా టాక్ నడుస్తుంది. తెలుగులో మాదిరిగా.. బాలీవుడ్‌లో కూడా బాలయ్యే డబ్బింగ్ చెప్పి ఉంటే రిజల్ట్ వేరే ఉండేదని.. అక్కడున్న తెలుగు ప్రేక్షకులు కొందరు మాట్లాడుకుంటుండటం విశేషం.