Advertisement
Google Ads BL

మైత్రి మూవీస్.. వాళ్ళని వదిలేలా లేదే..


ఒక నిర్మాణ సంస్థ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకులని అస్సలు వదులుకోరు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ని మైత్రి వారు రెండో సినిమాకి లాక్ చేసుకుంది. కానీ బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం వేరే నిర్మాణ సంస్థతో పని చేస్తున్నాడు. ఇక హారిక హాసిని వారు త్రివిక్రమ్ ని అస్సలు వదలరు. ఆ నిర్మాణ సంస్థలోనే త్రివిక్రమ్ సినిమాలు చేస్తారు. ఇప్పుడు మీరు మూవీస్ వారు గోపీచంద్ మలినేనిని, బాబీని వదిలేలా కనిపించడం లేదు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే క్రాక్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేనితో వారు బాలయ్యతో సినిమాని నిర్మించారు. వీరసింహరెడ్డి కి మంచి కలెక్షన్స్ రావడంతో గోపీచంద్ ని తదుపరి సినిమా కూడా తమ బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ లు ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని కే కాదు ఈ పండగకి మైత్రి మూవీస్ వారికి వాల్తేర్ వీరయ్యతో బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీని కూడా తన నెక్స్ట్ సినిమాని మైత్రి మూవీస్ లోనే చేసేలా వారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరి గోపీచంద్ మలినేని తదుపరి సినిమా ఏ హీరోతో చేసినా అది మైత్రి మూవీస్ లో చెయ్యాల్సిందే. అలాగే బాబీ నెక్స్ట్ హీరో ఎవరైనా ఆయన మైత్రిలోనే చెయ్యాలి. అలా ఆ ఇద్దరి హిట్ డైరెక్టర్స్ ని మైత్రి వారు లాక్ చేసిపెట్టేసుకున్నారు.

Mythri movies should not leave them..:

Director Gopichand Malineni & Bobby Next Movie updates 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs