Advertisement
Google Ads BL

అప్పుడు తిట్టి.. ఇప్పుడు పొగుడుతున్నారు


మెగాస్టార్‌కి సినిమాలు అవసరమా.. ఈ వయసులో ఆయనకి ఈ డాన్స్‌లు అవసరమా.. అసలు చిరు సినిమాలు చేస్తేనే గౌరవం ఇస్తారా.. చిరు సినిమాలు చెయ్యకపోయినా ఆయన్ని గౌరవిస్తారు. కొత్త రక్తానికి దారిచ్చి పాత రక్తం తప్పుకోవాలి.. మెగాస్టార్ యంగ్ హీరోయిన్ పక్కన డాన్సులు చేస్తుంటే ప్రేక్షకులు లేచి వెళ్ళిపోతున్నారంటూ రకరకాల కామెంట్స్ చేసిన వారే ఇప్పుడు వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ చూసి చిరంజీవి స్టామినాని తెగ పొగుడుతున్నారు.

Advertisement
CJ Advs

మెగాస్టార్‌కి సరైన సినిమా పడాలే కానీ.. మెగా స్టామినా అంటే చూపిస్తారు.. అదే ఇప్పుడు వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. నైజాంలో మహేష్ సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వసూళ్ళని ఒకటి రెండు రోజులలో కలెక్షన్స్ పరంగా వాల్తేరు వీరయ్య బీట్ చేసేస్తుంది. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ హడావిడి చేసినా.. వాల్తేరు వీరయ్యకి మొదట్లో నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మెగాస్టార్ అద్భుతం అని చెబుతున్నారు. వాల్తేరు వీరయ్య ఫుల్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది అంటున్నారు.

కేవలం ఇదంతా మెగాస్టార్ కున్న క్రేజ్, మెగాస్టామినా వలనే, మెగా ఫాన్స్ ఇప్పటికి వాల్తేరు వీరయ్య థియేటర్స్‌లో ఫుల్ ఆక్యుపెన్సీ చూపిస్తున్నారంటూ పొగుడుతుంటే.. అది నాలుకా.. తాటి బద్దా అంటున్నారు. అప్పుడు తిట్టిన నోరే.. ఇప్పుడు పొగడడం ఎందుకు? అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

All Negatives Turns Positive For Chiru with Waltair Veerayya Result:

Waltair Veerayya Creates Records at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs