Advertisement
Google Ads BL

రకుల్ ప్రీత్ సినిమా కష్టాలు విన్నారా..


ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా అందరినీ ఆకట్టుకున్న రకుల్ ప్రీత్‌కి మహేష్ స్పైడర్ బాగా దెబ్బేసింది. స్పైడర్ డిజాస్టర్ అవడంతో రకుల్ ప్రీత్‌ని టాలీవుడ్ లైట్ తీసుకుంది. ఆ తర్వాత రకుల్ బాలీవుడ్‌లో పాగా వేద్దామని చాలా ట్రై చేస్తుంది. అక్కడ ఓ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి పాతుకుపోదామనుకుంటే రకుల్ ప్రీత్‌కి అక్కడ సీనియర్ హీరోస్ తప్ప యంగ్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆ సీనియర్ హీరోలైన రకుల్‌కి హిట్ ఇస్తారేమో అనుకుంటే అదీ వర్కౌట్ అవ్వడం లేదు.

Advertisement
CJ Advs

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేసినా రకుల్‌కి పని జరగడం లేదు, బాలీవుడ్‌లో హిట్టు పడడం లేదు. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చేస్తుంది. అందులోనూ సెకండ్ హీరోయిన్ పాత్రే చేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో రకుల్ నటించిన చత్రీవాలి ఓటిటి‌లో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. రకుల్ తాను హీరోయిన్‌గా ఎన్ని కష్టాలు పడిందో చెప్పుకొచ్చింది. సినిమా అవకాశాల కోసం ముంబైలోని కాండీవాలా ప్రాంతంలో ఉండేదాన్ని. నాకు ఇండస్ట్రీలో పరిచయాలు లేవు, బ్యాగ్రౌండ్ అంతకన్నా లేదు. నా ట్రైనర్‌తో కలిసి బాంద్రాలోని ఓ కెఫేలో కూర్చుని ఏ ఏ సినిమా ఆఫీస్‌లకి వెళ్ళాలి, ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలంటూ ఆలోచించేదానిని.

కొన్ని బట్టలు బ్యాగ్‌లో వేసుకుని తిరుగుతూ.. కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకునేదానిని. కానీ సినిమా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. ఒక్కోసారి నన్ను సెలెక్ట్ చేసి, కొద్దిమేర షూట్ చేశాక వేరే హీరోయిన్‌ని పెట్టి సినిమా ఫినిష్ చేసేవారు. కానీ ఇదేమి నన్ను కుంగదీయలేదు, నేను పోరాటం అని చెప్పను, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. అందుకే కష్టపడి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ రకుల్.. తన సినిమా కష్టాలు చెప్పుకొచ్చింది. 

Rakul Preet Singh Revealed Her Struggles for Movie Chances:

Rakul Preet Singh Opens Her Struggles
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs