Advertisement
Google Ads BL

పఠాన్ టికెట్ కోసం సూయిసైడ్ చేసుకుంటాడట


కొన్నేళ్లుగా హిట్ లేని షారుఖ్ సినిమాలకి భారీగా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో కొడుకు ప్రాబ్లెమ్ తో సతమతమైన షారుఖ్ ఖాన్ పై అభిమానులకి బాగా సింపతీ ఉన్నట్లుగా అర్ధమవుతుంది. జనవరి 25 న పలు కాంట్రవర్సీల మధ్యన విడుదల కాబోతున్న పఠాన్ పై ప్రేక్షకుల్లో భీభత్సమైన క్రేజ్ ఉంది. అభిమానులు పఠాన్ టికెట్స్ కోసం కొట్టుకుంటున్నారు. టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. బుక్ మై షో లో పఠాన్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అంత క్రేజ్ సినిమాపై కనిపిస్తుంది. చాన్నాళ్ల తర్వాత షారుఖ్ రాబోతున్నాడు. హిట్ కొట్టేసి పదేళ్ళయింది. ఈ సినిమాతో హిట్ పక్కా కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే పఠాన్ టికెట్స్ కోసం ఓ అభిమాని సూయిసైడ్ చేసుకుంటాను అనడం విచిత్రంగా కాదు, నెటిజెన్స్ ఆగ్రహానికి లోనైనట్టుగా అనిపిస్తుంది. షారుఖ్ అభిమాని ఒకరు తనకి పఠాన్ టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, షారుక్ అంటే నాకు ప్రాణం, తన దగ్గర పఠాన్ టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు, నాకు ఎవరైనా సాయం చెయ్యండి, పఠాన్ టికెట్ పంపించండి. లేదంటే ఈ ఫౌంటైన్ లో దూకి చచ్చిపోతా అంటూ ఆ వీడియోలో బెదిరిస్తున్నాడు. 

హీరోలంటే అభిమానం ఉండొచ్చు కాని.. ఓ టికెట్ కోసం చచ్చిపోవడం అంటూ కొంతమంది ఫైర్ అవుతుంటే.. మరికొంతమంది ఆ వ్యక్తి పై జాలి పడుతున్నారు. మరి పఠాన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ఈ చిన్న ఉదాహరణ సరిపోతుంది అంటూ షారుఖ్ అభిమానులు ఆ వ్యక్తికి ఎమన్నా సహాయం చేస్తారేమో చూడాలి. 

I will commit suicide if I don't get the ticket for Pathaan:

Shah Rukh Khan fan posts tearful video 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs