Advertisement
Google Ads BL

అందుకే సరోగసి ద్వారా బిడ్డని కన్నాను: ప్రియాంక


చాలామంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత తల్లయితే అందం తగ్గిపోతుంది అంటూ బిడ్డలని కనడానికి వెనుకాడుతుంటారు. కానీ కొంతమంది ధైర్యంగా బిడ్డలని కని కెరీర్ లో ముందుకు సాగుతారు. అందుకు ఉదాహరణలు అలియా భట్, కరీనా కపూర్, కాజల్ లాంటి. కానీ కొంతమంది బిడ్డల కోసం సరొగసీ గర్భాన్ని ఆశ్రయిస్తారు. అలా గత ఏడాది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కోలీవుడ్ హీరోయిన్ నయనతారలు సరోగసి ద్వారా తల్లులయ్యారు. అయితే ప్రియాంక చోప్రా, నయనతార ఇద్దరూ అందం తగ్గిపోకుండా ఇలా సరొగసీని ఆశ్రయించారని అనుకున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా ప్రియాంకర్ చోప్రా తన బిడ్డ గురించిన వివరాలు మొదటిసారి రివీల్ చేసింది. తన కూతురు మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాను. బేబీ పుట్టినప్పుడు చాలా చిన్నగా నా చేతికన్నా చిన్నగా ఉంది. బేబీని ఇంటెన్సివ్ కేర్ లో పెట్టినప్పుడు అసలు బ్రతుకుతుంది అనుకోలేదు. నేను నిక్ చాలాబాధపడేవాళ్ళం. ఆ టైమ్ లో ఎంతోమంది డాక్టర్స్ ని కలిసాము, నర్స్ లు మాత్రం నిజంగా దేవుళ్లతో సమానం. వాళ్ళు ఎంతోమంది బిడ్డలకి ప్రాణాలు పోస్తున్నారు.

ఇక నేను సరోగసి ద్వారా ఎందుకు బిడ్డని కన్నాను అంటే.. నాకు ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. అందుకే సరోగసి ద్వారా తల్లయ్యాను. కానీ నేను నా అందం తగ్గిపోతుంది అనే భయంతో సరోగసి ద్వారా బిడ్డని కన్నాను అన్నప్పుడు చాలా బాధగా అనిపించింది అంటూ ప్రియాంక చోప్రా తన బిడ్డ మాల్తీ జన్మ రహస్యాన్ని రివీల్ చేసింది.

Priyanka Chopra reveals why she opted for surrogacy:

Priyanka Chopra reveals she opted for surrogacy due health reasons
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs