మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య సినిమా చేసి ఆయనకి డిసాస్టర్ ఇచ్చాడు. ఈయన కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి ప్రతి సందర్భంలో కొరటాలకి ఇండైరెక్ట్ కౌంటర్లు వేస్తూనే.. నేను కోరటాలని అనలేదు అంటూ వివరణ ఇస్తూ వస్తున్నారు. కానీ చిరంజీవి ఏం మట్లాడినా కొరటాల మాత్రం కామ్ గానే ఉన్నాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR30 మొదలు పెట్టే ప్రాసెస్ లో ఉన్నాడు. ఫిబ్రవరి లో పూజా కార్యక్రాలతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది.
అయితే ఎన్టీఆర్-కొరటాల శివ NTR30 పూజా కార్యక్రమానికి మెగాస్టార్ ని గెస్ట్ గా ఆహ్వానించారని తెలుస్తుంది. అటు మెగా-ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ఇద్దరూ ఈ న్యూస్ చదివి తెగ ఆనందించేస్తున్నారు. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా NTR30 మొదలు కాబోతుంది అంటున్నారు. నిజంగా ఇదే జరిగితే మెగాసార్-కొరటాల మధ్యలో జరిగే కోల్డ్ వార్ కి ఫుల్ స్టాప్ పడినట్లే. మరోసారి మెగాస్టార్ ఎమన్నా మళ్ళీ కొరటాల విషయంలో వివరణ కూడా ఇచ్చుకోనక్కర్లేదు.
నిజంగా మెగాస్టార్ గనక NTR30 పూజా కార్యక్రానికి హాజరైతే విషయం మాములుగా ఉండదు రచ్చ రచ్చే.. అటు చిరు-కొరటాల సమస్య కూడా ముగిసిపోతుంది.