Advertisement
Google Ads BL

విజయ్ ఆంటోని ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్


బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి బిచ్చగాడు 2 షూటింగ్ లో రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. బిచ్చగాడు 2 షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. అక్కడ విజయ్ ఆంటోని బోట్ సీన్‌ షూట్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సీన్ లో బోటు ఎదురుగా బోటు వస్తున్న టైమ్ లో రెండు బొట్లు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో విజయ్ ఆంటోని పైకి ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో విజయ్ ఆంటోని ముఖం, దవడకు గాయాలయ్యాయని, పళ్లు కూడా విరిగాయంటూ వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే ఈలోపులో విజయ్ ఆంటోని ఆరోగ్యం విషమం, ఆయనని మలేషియా ఆసుపత్రి నుండి చెన్నై ఆసుపత్రికి షిఫ్ట్ చేసారని అంటున్నారు. కొంతమంది విజయ్ ఆంటోని ఆరోగ్యం బాగానే ఉంది అంటుంటే.. కాదు విజయ్ ఆంటోని ప్రస్తుతం కోమాలోకి వెళ్ళాడంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే కోమాలోకి వెళ్లారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన బాగానే ఉన్నారు.. విజయ్ కి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అంటూ గుసగుసలాడుతున్నారు కొందరు. 

అసలు విజయ్ ఆంటోని ఆరోగ్యంపై ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ పూర్తిగా అప్ డేట్ ఇస్తేనే కానీ ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఈ రూమర్లుకి ఫుల్ స్టాప్ పడదు. లేదంటే ఆసుపత్రి వర్గాలైనా విజయ్ హెల్త్ బులిటెన్ వదిలితే బావుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.

Shocking news on Vijay Antony health:

Vijay Antony in speedboat accident in Malaysia
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs