అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీతో ఇండియా వైడ్ గా అభిమానులని సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ అంటే ఆయన అభిమానులకి విపరీతమైన క్రేజ్. అల్లు ఆర్మీ అంటూ మాములుగా హడావిడి చెయ్యరు. అల్లు అర్జున్ కూడా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళాడు. అక్కడ అల్లు అభిమానులు ఆయనకి అపూర్వ స్వాగతం పలికారు. నిన్న గురువారం బన్నీ వైజాగ్ లోకి అడుగుపెట్టాడు.
అల్లు ఆర్మీ బన్నీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడమే కాదు అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. బన్నీ ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ వారు చేసిన హడావిడి ఇప్పుడు వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో మొదలు కాగా.. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ షూటింగ్ లో పాల్గొంటుంటే.. హీరోయిన్ రష్మిక మాత్రం తానూ ఫిబ్రవరిలో పుష్ప యూనిట్ తో జాయిన్ అవుతున్నట్లుగా చెప్పింది.